జనసేన ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్‌కు చిక్కులు...

ఓ వైపు అధినేత పవన్ కళ్యాణ్ ఇలా జగన్ మీద విమర్శల బాణాలు సంధిస్తుంటే, మరోవైపు ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ మాత్రం జగన్ తీసుకొచ్చిన పథకాలను అభినందిస్తున్నారు.

news18-telugu
Updated: December 8, 2019, 3:18 PM IST
జనసేన ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్‌కు చిక్కులు...
జనసేన ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్
  • Share this:
జనసేన ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్‌కు చిక్కొచ్చిపడింది. ముందు నుయ్యి వెనుక అన్నట్టుగా మారింది. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు రేపటి నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ క్రమంలో ఆయన సమావేశాల్లో ఎలా వ్యవహరించాలనేదానిపై క్లారిటీ లేని పరిస్థితి. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని పవన్ కళ్యాణ్ దుమ్మెత్తిపోస్తున్నారు. ఇసుక కొరత, ఇంగ్లీష్ మీడియం, మత మార్మిడుల అంశాలపై సీఎం జగన్‌ను టార్గెట్ చేస్తున్నారు. ఉల్లి ధరలపై కూడా జగన్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తున్నారు పవన్ కళ్యాణ్. ఓ వైపు అధినేత పవన్ కళ్యాణ్ ఇలా జగన్ మీద విమర్శల బాణాలు సంధిస్తుంటే, మరోవైపు ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ మాత్రం జగన్ తీసుకొచ్చిన పథకాలను అభినందిస్తూ, సీఎం ఫొటోలకు పాలాభిషేకం చేశారు. ఇటీవల వైఎస్ఆర్ మత్స్యకార భరోసా కార్యక్రమంలో కూడా రాపాక వరప్రసాద్ సీఎంతో కలసి వేదిక పంచుకున్నారు. అసెంబ్లీలో రాపాక వరప్రసాద్ ఏం చేస్తారనే అంశంపై జనసేన అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. పవన్ కళ్యాణ్ మన్ కీ బాత్‌ను అసెంబ్లీలో వినిపిస్తారా? లేకపోతే మౌనంగా ఉండిపోతారా? అనేది చూడాలి.

First published: December 8, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>