పవన్‌కు షాక్... అసెంబ్లీలో అనుకూలంగా ఓటు వేస్తానన్న రాపాక

సోమవారం ప్రత్యేక అసెంబ్లీ సమావేశంలో మూడు రాజధానుల అంశంపై చర్చ జరిగితే, అందుకు అనుకూలంగా చర్చలో పాల్గొంటానని ఆయన ఆదివారం తెలిపారు.

news18-telugu
Updated: January 20, 2020, 8:27 AM IST
పవన్‌కు షాక్... అసెంబ్లీలో అనుకూలంగా ఓటు వేస్తానన్న రాపాక
జనసేన ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్
  • Share this:
జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు మరో షాక్ ఇచ్చారు ఎమ్మెల్యే రాపాక వరప్రసాదరావు. మూడు రాజధానులకు తన మద్దతు అన్నారు రాపాక. అసెంబ్లీలో ఓటింగ్‌ జరిగితే అనుకూలంగా ఓటు వేస్తానని చెప్పుకొచ్చారు. మూడు రాజధానుల ఏర్పాటుకు అసెంబ్లీలో సంపూర్ణ మద్దతు ప్రకటించాలని జనసేన పార్టీ నుంచి గెలిచిన ఏకైక ఎమ్మెల్యే రాపాక వరప్రసాదరావు నిర్ణయించారు. సోమవారం ప్రత్యేక అసెంబ్లీ సమావేశంలో మూడు రాజధానుల అంశంపై చర్చ జరిగితే, అందుకు అనుకూలంగా చర్చలో పాల్గొంటానని ఆయన ఆదివారం తెలిపారు.

రాష్ట్రంలో అన్ని ప్రాంతాలు సమానంగా అభివృద్ధి చెందేందుకు, పరిపాలనా వికేంద్రీకరణ పరంగానూ ప్రభుత్వం చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందన్నారు. శాసనసభలో మూడు రాజధానుల ప్రతిపాదన అంశంపై ఓటింగ్‌ జరిగితే దానికి మద్దతుగానే తాను ఓటు వేస్తానన్నారు. అయితే జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్‌ కళ్యాణ్‌ మాత్రం రాజధానిని అమరావతిలోనే కొనసాగించాలంటూ డిమాండ్‌ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అసెంబ్లీ ఆ పార్టీ ఎమ్మెల్యే రాపాక మూడు రాజధానుల ఏర్పాటుకు మద్దతు ప్రకటించడం ఇప్పుడు సర్వత్రా ఆసక్తికరంగా మారింది.

First published: January 20, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు