వైసీపీ ఎమ్మెల్యే తల నరుకుతా.. జనసేన నేత సంచలన వ్యాఖ్యలు

పవన్ కల్యాణ్‌కు దమ్ముంటే అనంతపురంకు రావాలని ప్రకాశ్ రెడ్డి సవాల్ విసిరారు. ఎంత మంది తలలు నరుకుతారో తామూ చూస్తామని స్పష్టం చేశారు.

news18-telugu
Updated: December 5, 2019, 5:20 PM IST
వైసీపీ ఎమ్మెల్యే తల నరుకుతా.. జనసేన నేత సంచలన వ్యాఖ్యలు
పవన్ కుమార్, పవన్ కల్యాణ్
  • Share this:
పవన్ కల్యాణ్ చిత్తూరు పర్యటనలో జనసేన నేత పవన్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పవన్ కల్యాణ్ ఆదేశిస్తే.. వైసీపీ నేతల తల నరికేందుకు సిద్ధమని ఆవేశంగా మాట్లాడారు. అందరికీ మర్యాద ఇవ్వాలన్న ఉద్దేశంతోనే వెనక్కితగ్గుతున్నామని.. అంతే తప్ప వైసీపీ నేతలకు భయపడి కాదని విరుచుకుపడ్డారు. అనంతపురం నేతలతో పవన్ కల్యాణ్ సమీక్షా సమావేశం సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారు పవన్ కుమార్.

మేం నీతిగా ఉన్నా. అందరికీ మర్యాద ఇద్దామన్న ఉద్దేశంతోనే తగ్గుతున్నాం. మా సార్ వదిలేస్తే.. మీ తలలు నరకడానికి ఏ మాత్రం వెనకాడం. జనసేన కార్యకర్తలంతా సార్ చెప్పిన మాటలకు కట్టుబడి వెనక్కి తగ్గుతున్నాం. అంతే తప్ప మీరంటే భయంతో కాదు. వైసీపీ ఎమ్మెల్యే ప్రకాశ్ రెడ్డే కాదు. ఎవరైనా సరే మేం రెడీ. మీరు రెడీనా..?
పవన్ కుమార్
ఐతే జనసేన నేత పవన్ కుమార్ ఎవరో తమకు తెలియదని రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి అన్నారు. ఈ వ్యాఖ్యలను జనసేన అధినేత పవన్ కల్యాణే చేసినట్లుగా తాము భావిస్తామని చెప్పారు. పవన్ కల్యాణ్‌కు దమ్ముంటే అనంతపురంకు రావాలని ప్రకాశ్ రెడ్డి సవాల్ విసిరారు. ఎంత మంది తలలు నరుకుతారో తామూ చూస్తామని స్పష్టం చేశారు. దీనిపై పవన్ కల్యాణ్ స్పందించాలని.. లేదంటే పోలీసులకు ఫిర్యాదు చేస్తామని తెలిపారు. పవన్ కళ్యాణ్ వెనక టీడీపీ ఉండి.. ఈ వ్యాఖ్యలు మాట్లాడిస్తుందని విమర్శించారు ప్రకాశ్ రెడ్డి.
First published: December 5, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు