పవన్ కల్యాణ్‌కు షాక్... బీజేపీలోకి జనసేన కీలక నేత

ఓ వైపు జనసేన అధినేత పవన్ కల్యాణ్ పార్టీ పటిష్ఠతపై దృష్టి పెడుతుంటే... మరోవైపు, జనసేనలో కీలక నేత పార్టీ మారడం జనసేనకు పెద్ద దెబ్బేనని చెబుతున్నారు

news18-telugu
Updated: August 4, 2019, 8:25 AM IST
పవన్ కల్యాణ్‌కు షాక్... బీజేపీలోకి జనసేన కీలక నేత
జనసేన అధినేత పవన్ కల్యాణ్
news18-telugu
Updated: August 4, 2019, 8:25 AM IST
పార్టీ ఫిరాయింపులతో టీడీపీకి వరసగా షాక్‌లు తగులుతున్నాయి. తెలుగు తమ్ముళ్లు, సీనియర్ నేతలు... బీజేపీలోకి వలసపోతున్నారు. ఇప్పుడీకోవాలో జనసేన కూడా చేరింది. తాజాగా జనసేన కీలక నేత కమల తీర్థం పుచ్చుకున్నారు. నెల్లూరు జిల్లాకు చెందిన జనసేన కీలక నేత, త్రిపుర కన్‌స్ట్రక్షన్స్ అధినేత పసుపులేటి సుధాకర్ బీజేపీలో చేరిపోయారు.  బీజేపీ జాతీయ అధ్యక్షుడు, కేంద్రమంత్రి అమిత్ షా, వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ నడ్డా, జాతీయ ప్రధాన కార్యదర్శి పి.మురళీధర్‌రావు సమక్షంలో ఢిల్లీలో ఆయన కాషాయం కండువా కప్పుకున్నారు.

ఆర్థికంగా బలమైన సుధాకర్ బీజేపీలో చేరడంతో కావలి నియోజకవర్గంలో బీజేపీ బలపడుతుందని బీజేపీ నేతలు భావిస్తున్నారు. ఓవైపు జనసేన అధినేత పవన్ కల్యాణ్ పార్టీ పటిష్ఠతపై దృష్టి పెడుతుంటే... మరోవైపు, జనసేనలో కీలక నేతగా ఉన్న పసుపులేటి సుధాకర్ పార్టీ మారడం జనసేనకు పెద్ద దెబ్బేనని చెబుతున్నారు.

First published: August 4, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...