చంద్రబాబును వెనకేసుకొచ్చిన నాగబాబు.. ఆయన్ను వదిలేయండి అంటూ..

చంద్రబాబు ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రి అని, ఓడిపోయినంత మాత్రాన ఆయన్ను దారుణంగా విమర్శించటం తప్పు అని మెగా బ్రదర్ నాగబాబు అన్నారు.

news18-telugu
Updated: May 28, 2019, 10:37 AM IST
చంద్రబాబును వెనకేసుకొచ్చిన నాగబాబు.. ఆయన్ను వదిలేయండి అంటూ..
నాగబాబు, చంద్రబాబునాయుడు
  • Share this:
ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఘోరంగా పరాజయం పాలైంది. ఇటు అసెంబ్లీ, అటు పార్లమెంటులోనూ దారుణ ఓటమిని చవిచూసింది. ఈ నేపథ్యంలో అన్ని పక్షాలు ఆ పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడిపై విమర్శలు ఎక్కుపెట్టాయి. అయితే, చంద్రబాబుకు జనసేన నేత, మెగా బ్రదర్ నాగబాబు మద్దతుగా నిలిచారు. ఛంద్రబాబును విమర్శించడం సరికాదని అన్నారు. ట్విట్టర్ వేదికగా.. ‘చంద్రబాబు గారు మన ex సీఎం..ఇప్పుడు defeat అయినంత మాత్రాన ఆయన్ను దారుణంగా విమర్శించటం తప్పు. మనిషి పవర్ లో ఉండగా విమర్శించటం వేరు. ఓడిపోయాక విమర్శించటం చేతకానితనం.. ప్రత్యర్థి నిరాయుధుడు అయ్యి నిలబడితే వదిలెయ్యాలి. అంతే కాని అవకాశం దొరికింది కదా అని ట్రోల్ చెయ్యటం ఒక శాడిజం’ అని ట్వీట్ చేశారు.

అయితే, నాగబాబు ట్వీట్‌పైనా నెటిజన్లు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. టీడీపీ, జనసేన ఒకటేనని ప్రజల్లోకి వెళ్లిందని, దాని ఫలితమే వైసీపీ గెలుపు అని వ్యాఖ్యానిస్తున్నారు. ఈ రెండు పార్టీలు ఒకటేనని ప్రత్యర్థులు ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లారని, టీడీపీని వదిలేసి జనసేన భవిష్యత్తు కార్యక్రమాలపై దృష్టిపెడితే మంచిదని సూచిస్తున్నారు.

First published: May 28, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...