ఏపీ రాజధానులపై జగన్‌కు నాగబాబు విజ్ఞప్తి

ప్రజల్ని ఏడిపించిన ఏ ప్రభుత్వం నిలబడలేదన్నారు. మీ స్వార్థ ప్రయోజనాల కోసం ప్రజల్ని ఇబ్బందులు గురి చేయోద్దన్నారు.

news18-telugu
Updated: December 22, 2019, 1:12 PM IST
ఏపీ రాజధానులపై జగన్‌కు నాగబాబు విజ్ఞప్తి
నాగబాబు, వైఎస్ జగన్
  • Share this:
ఏపీలో మూడు రాజధానులపై  జగన్ చేసిన ప్రకటనపై .. సినీనటుడు, జనసేన నాయకుడు స్పందించారు. ఏపీ రాజధాని ప్రాంతంలో ఇటీవలే జనసేన నాయకులతో కలిసి పర్యటించానన్నారు. రాజధాని ప్రాంతాల్లో రాజధాని కోసం భూములు ఇచ్చిన రైతుల పరిస్థితి దయనీయంగా మారిందన్నారు. అమరావతి నుంచే పరిపాలన కొనసాగించాలని అక్కడున్న రైతులంతా రోడ్డుపైకొచ్చి నిరసనలకు దిగిన విషయం తెలిసిందే. దీంతో వారి ఆందోళనల్ని అర్థం చేసుకోవాలని జగన్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. దయచేసి వారి ఇబ్బంది అర్థం చేసుకోవాలన్నారు. జగన్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అమరావతిలో రాజధాని అంటే అవునన్నారు. అధికారం జగన్ చేతిలో ఉంది.. ఆయన ఎలాంటి నిర్ణయం తీసుకున్నా.. రాజధాని రైతుల్నిదృష్టిలో పెట్టుకోవాలన్నారు. రైతులతో పాటు వారి పిల్లల భవిష్యత్తు కూడా ప్రశ్నార్థకంగా మారింది.

వైసీపీ చెబుతున్నట్లు అమరావతిలో స్కాం జరిగినా.. దానిపై చర్యలు తీసుకోవాలని నేను కూడా కోరుతున్నానన్నారు నాగాబాబు. అయితే కొద్దిమంది చేసిన తప్పుకు కొన్నివేలమందిని ఇబ్బంది పెట్టడం సరికాదన్నారు. అభివృద్ధి ఎక్కడైనా చేయండి కానీ... రాజధాని విషయంలో కనఫ్యూ‌జ్‌కు గురి చేయకండన్నారు. ప్రజల్ని ఏడిపించిన ఏ ప్రభుత్వం నిలబడలేదన్నారు. మీ స్వార్థ ప్రయోజనాల కోసం ప్రజల్ని ఇబ్బందులు గురి చేయోద్దన్నారు. రైతులకు స్పష్టత ఇచ్చి వారికి అండగా నిలవాలన్నారు. భూముల్ని వెనక్కి ఇచ్చేయడం సమస్యకు పరిష్కారం కాదన్నారు. రైతులకు మాత్రి అన్యాయం చేయోద్దని జగన్‌కు విజ్ఞప్తి చేశారు. ఏపీ అభివృద్ధి విషయంలో తమ సంపూర్ణ సహకారం ఉంటుందన్నారు.First published: December 22, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు