Home /News /politics /

JANASENA LEADER NAGABABU KEY DECISION IN POLITICS AK

నాగబాబు కీలక నిర్ణయం... నెలలో వారం అక్కడే...

నటుడు నాగబాబు (ఫైల్ ఫోటో)

నటుడు నాగబాబు (ఫైల్ ఫోటో)

Nagababu | వచ్చే ఎన్నికల్లో కూడా మళ్లీ నరసాపురం పార్లమెంట్ నియోజకవర్గం నుంచి పోటీ చేయాలనే ఆలోచనలో ఉన్న నాగబాబు... వీలు దొరికినప్పుడల్లా అక్కడ పర్యటిస్తున్నారు.

    జనసేన తరపున నరసాపురం లోక్ సభ స్థానానికి పోటీ చేసిన పవన్ కళ్యాణ్ సోదరుడు, సినీనటుడు నాగబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు. నరసాపురంలో ఓడినా... రాజకీయాల్లో తాను కొనసాగుతానని నాగబాబు స్పష్టం చేసిన విషయం తెలిసిందే. నాగబాబుకు జనసేనలో కీలక పదవి ఇవ్వాలని పవన్ కళ్యాణ్ భావిస్తున్నారనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. అయితే దీనిపై ఇప్పటివరకు జనసేన అధినేత ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. అయితే వచ్చే ఎన్నికల్లో కూడా మళ్లీ నరసాపురం పార్లమెంట్ నియోజకవర్గం నుంచి పోటీ చేయాలనే ఆలోచనలో ఉన్న నాగబాబు... వీలు దొరికినప్పుడల్లా అక్కడ పర్యటిస్తున్నారు.

    తాజాగా భీమవరంలో పర్యటించిన నాగబాబు... అక్కడి కార్యకర్తలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా త్వరలోనే మళ్లీ రాజకీయాల్లో పూర్తిగా యాక్టివ్ అవుతానని నాగబాబు వారికి వివరించారు. రాబోయే రోజుల్లో నెలకు వారం రోజుల పాటు నరసాపురం లోక్ సభ నియోజకవర్గంలో ఉండేలా చూస్తానని ఆయన జనసేన కార్యకర్తలకు హామీ ఇచ్చారు. నియోజకవర్గంలో అనేక సమస్యలు ఉన్నాయని... వాటిని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే విధంగా జనసైనికులు పని చేయాలని నాగబాబు వారికి సూచించారు. గత ఎన్నికల్లో ఓటమికి ఏ మాత్రం కుంగిపోవద్దని... రాబోయే రోజులు జనసేనవే అని నాగబాబు వారికి ధైర్యం చెప్పారు.
    Published by:Kishore Akkaladevi
    First published:

    Tags: Janasena, Nagababu, Narsapuram S01p09

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు