నువ్వు చెప్పింది కరెక్ట్... వైసీపీ ఎంపీకి నాగబాబు కౌంటర్...

వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి పవన్ కళ్యాణ్‌పై చేసిన వ్యాఖ్యలకు ఘాటుగా కౌంటర్ ఇచ్చారు నాగబాబు.

news18-telugu
Updated: April 11, 2020, 5:31 PM IST
నువ్వు చెప్పింది కరెక్ట్... వైసీపీ ఎంపీకి నాగబాబు కౌంటర్...
నాగబాబు (Twitter/Nagababu)
  • Share this:
వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డికి జనసేన నేత, పవన్ కళ్యాణ్ సోదరుడు నాగబాబు తనదైన స్టయిల్లో కౌంటర్ ఇచ్చారు. పవన్ కళ్యాణ్‌పై విజయసాయిరెడ్డి చేసిన వ్యాఖ్యలపై స్పందించిన నాగబాబు... అవును విజయసాయి నువ్వు చెప్పింది కరెక్ట్ అంటూ కామెంట్ చేశారు. ఈ ఎదవ రాజకీయాలు చేయటానికి నీ లాంటి గుంటనక్కలున్న సంగతి మాకు తెలుసు అని ఘాటుగా విమర్శించారు. మరి మన ఇద్దరి కామన్ స్నేహితుడి ద్వారా నా ఇంటికి వచ్చి.. పవన్‌తో దోస్తీకి రెడి అన్న మీ గుంట నక్కరాజకీయలు నాకు గుర్తున్నాయి అంటూ వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు.



అంతకుముందు పవన్ కళ్యాణ్‌పై విజయసాయిరెడ్డి సెటైర్లు వేశారు. కరోనా ఆపత్కాలంలో రాజకీయాలు చేయకుండా జనసేన స్వీయ నియంత్రణ పాటిస్తోందట అంటూ వ్యాఖ్యానించారు. రాజకీయాలు చేయడానికి నీకు గ్రౌండే లేదు కదా పవన్ అంటూ కామెంట్ చేశారు. ఎక్కడో హైదరాబాద్ లో కూర్చుని ‘నేను లేస్తే మనిషిని కాదు అని చిటికెలేసినట్టుగా ఉంది నీ వాలకం అంటూ ఎద్దేవా చేశారు. ప్రజా తీర్పును అప్పుడే మర్చిపోతే ఎలా ? అని పవన్ కళ్యాణ్‌ను విమర్శించారు.
Published by: Kishore Akkaladevi
First published: April 11, 2020, 5:31 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading