Janasena: మరో సీటుపై జనసేన ముఖ్యనేత ఫోకస్.. పవన్ కళ్యాణ్‌ను ఫాలో అవుతారా ..?

పవన్ కళ్యాణ్ (ఫైల్ ఫోటో)

Janasena: జనసేన ముఖ్యనేతల్లో ఒకరైన నాదెండ్ల మనోహర్ కూడా తాను గతంలో పోటీ చేసిన నియోజకవర్గాన్ని వదిలి మరో నియోజకవర్గంపై దృష్టి పెట్టారని.. వచ్చే ఎన్నికల్లో అక్కడి నుంచి పోటీ చేసే విషయమై సీరియస్‌గా ఆలోచిస్తున్నారని రాజకీయవర్గాల్లో టాక్ వినిపిస్తోంది.

  • Share this:
    రాజకీయ నేతలు పార్టీలు మార్చినంత తేలిగ్గా నియోజకవర్గాలను మార్చరు. పార్టీలు మారినా.. ఒక నియోజకవర్గం నుంచి పోటీ చేస్తుంటారు. అయితే తప్పనిసరి పరిస్థితుల్లో తాము గతంలో పోటీ చేసిన నియోజకవర్గాలను వదిలి వేరే నియోజకవర్గాల్లో పోటీ చేయడానికి ప్రయత్నిస్తుంటారు. తాజాగా జనసేన ముఖ్యనేతల్లో ఒకరైన నాదెండ్ల మనోహర్ కూడా తాను గతంలో పోటీ చేసిన నియోజకవర్గాన్ని వదిలి మరో నియోజకవర్గంపై దృష్టి పెట్టారని.. వచ్చే ఎన్నికల్లో అక్కడి నుంచి పోటీ చేసే విషయమై సీరియస్‌గా ఆలోచిస్తున్నారని రాజకీయవర్గాల్లో టాక్ వినిపిస్తోంది. తెనాలి నుంచి నాదెండ్ల మనోహర్ గతంలో రెండుసార్లు పోటీ చేశారు. అయితే రాష్ట్ర విభజన తర్వాత ఆయన వైసీపీలో చేరుతారనే ప్రచారం జరిగిన ఆయన జనసేనలో చేరారు. ప్రస్తుతం జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ గా కొనసాగుతున్నారు.

    గత ఎన్నికల్లో వైసీపీ ప్రభంజనం కొనసాగడంతో నాదెండ్ల మనోహర్ ఓటమి పాలయ్యారు. ప్రస్తుతం ఈ స్థానంలో వైసీపీ, టీడీపీ రెండు బలంగా ఉన్నాయి. దీంతో వచ్చే ఎన్నికల్లో ఈ స్థానం నుంచి ఆయన పోటీ చేస్తే గెలుపు అవకాశాలు తక్కువేనని తెలుస్తోంది. దీంతో ఆయన తెనాలి నుంచి మరోసారి పోటీ చేయాలా? లేదంటే కొత్త నియోజకవర్గం నుంచి బరిలో దిగాలా? అనే ఆలోచనలో పడినట్లు తెలుస్తోంది. ఈక్రమంలోనే ఆయన మరో నియోజకవర్గం వేటలో కూడా పడినట్లు తెలుస్తోంది. తెనాలి లేదంటే గుంటూరు పశ్చిమ నియోజకవర్గం నుంచి ఆయన బరిలో నిలిచే అవకాశం ఉందనే టాక్ బలంగా విన్పిస్తోంది.

    జనసేన బలంగా ఉన్న నియోజకవర్గాల్లో గుంటూరు కూడా ఒకటి. దీంతో ఈ రెండింటిలో ఏదో ఒక స్థానంలో ఆయన పోటీచేసే అవకాశం ఉందని తెలుస్తోంది. నిజానికి గత ఎన్నికల్లో భీమవరం, గాజువాక నుంచి పోటీ చేసిన పవన్ కళ్యాణ్.. వచ్చే ఎన్నికల్లో ఈ సీట్ల నుంచి పోటీ చేస్తారా లేక మరో సీటు ఎంచుకుంటారా ? అనే చర్చ జరుగుతోంది.

    Telangana: తెలంగాణలో త్వరలోనే బస్సు ఛార్జీలు, కరెంట్ ఛార్జీలు పెంపు ?

    Telangana: కేసీఆర్ కాదు కేటీఆర్.. వ్యూహం మార్చిన రేవంత్ రెడ్డి.. అసలు కారణం ఇదేనా ?

    అయితే వచ్చే ఎన్నికల్లో ఆయన తిరుపతి నుంచి పోటీ చేసే అవకాశం ఉందనే వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో జనసేన పార్టీకి చెందిన ముఖ్యనేత నాదెండ్ల మనోహర్ కూడా నియోజకవర్గం మారే ఆలోచన చేస్తున్నారనే న్యూస్ ఆ పార్టీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
    Published by:Kishore Akkaladevi
    First published: