• HOME
  • »
  • NEWS
  • »
  • POLITICS
  • »
  • JANASENA LEADER NADENDLA MANOHAR HINTS THAT MEGASTAR CHIRANJEEVI TO FOLLOW HIS BROTHER PAWAN KALYAN VERY SOON PRN

Chiranjeevi: మళ్లీ రాజకీయాల్లోకి మెగాస్టార్ చిరంజీవి..? జనసేన ముఖ్యనేత సంచలన వ్యాఖ్యలు

Chiranjeevi: మళ్లీ రాజకీయాల్లోకి మెగాస్టార్ చిరంజీవి..? జనసేన ముఖ్యనేత సంచలన వ్యాఖ్యలు

చిరంజీవి, పవన్ కళ్యాణ్ (File/Photo)

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాజకీయాల్లోకి మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) రీ ఎంట్రీ ఇవ్వనున్నారా..? తమ్ముడు వెంటే అనయ్య నడవబోతున్నారా..?

  • Share this:
    ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి మెగాస్టార్ చిరంజీవి రీ ఎంట్రీ ఇవ్వనున్నారా..? తమ్ముడు వెంటే అనయ్య నడవబోతున్నారా..? త్వరలోనే చిరు జనసేనలో చేరబోతున్నారా..? ప్రస్తుతం రాజకీయవర్గాల్లో ఇదే హాట్ టాపిక్ గా మారింది. విజయవాడలో జనసేన పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనం రేపుతున్నాయి. జనసేన క్రియాశీలక కార్యకర్తలతో సమావేశం సందర్భంగా మెగాస్టార్ పొలిటికల్ రీ ఎంట్రీపై మనోహర్ కీలక కామెంట్స్ చేశారు. త్వరలో పవన్ కల్యాణ్ వెంట చిరంజీవి రాబోతున్నారని ప్రకటించారు. పవన్ కు అండగా ఉంటామని చిరంజీవి హామీ ఇచ్చారని తెలిపారు. ఐతే నాదెండ్ల మనోహర్ ఈ కామెంట్స్ చేయడం వెనుక ఏం జరిగిందనేది ఆసక్తికరంగా మారింది. మనోహర్.. చిరంజీవి పెరు చెప్పగానే జనసేన కార్యకర్తలు, అభిమానుల ఆనందానికి హద్దు లేకండా పోయింది.

    కార్యకర్తలతో మీటింగ్ లో మాట్లాడిన నాదెండ్ల మనోహర్.., పవన్ కల్యాణ్ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇవ్వడానికి కారణం చిరంజీవేనని చెప్పారు. రెండు మూడేళ్లు సినిమాలు చేసిన తర్వాత రాజకీయాలు చేసుకోవాలని   తర్వాత నీ రాజకీయ ప్రస్థానంలో  నేను కూడా నీకు అండగా నిలబడతానని.., నీతో కలిసి నడుస్తాననంటూ చిరంజీవి పవన్ కు హామీ ఇచ్చారని మనోహర్ అన్నట్లు సమాచారం. ఐతే రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలు, త్వరలో జరగనున్న తిరుపతి ఉపఎన్నికల నేపథ్యంలో ఇతర పార్టీల్లో ఉన్న మెగా అభిమానులను జనసేన వైపు తిప్పడానికి మనోహర్ ఇలా మాట్లాడి ఉంటారా అనే చర్చ కూడా జరుగుతోంది. ప్రజారాజ్యం అనుభవంతో చిరంజీవి రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. మధ్యలో సినిమా పరిశ్రమ అభివృద్ధి గురించి ఏపీ సీఎం జగన్, తెలంగాణ సీఎం కేసీఆర్ తో కలిసి మాట్లాడారు.

    ఇది చదవండి: భూమా ఫ్యామిలీని టార్గెట్ చేసిన సీఎం జగన్... పాతికేళ్ల ఆధిపత్యానికి చెక్


    చిరంజీవి జనసేనకు దూరంగా ఉన్నా ఆయన కుటుంబ సభ్యులు మాత్రం పవన్ కు బహిరంగంగానే మద్దతు ప్రకటించారు. నాగబాబు జనసేనలో క్రియాశీలకంగా ఉన్నారు. నర్సాపురం ఎంపీ అభ్యర్థిగా కూడా పోటీ చేశారు. చిరంజీవి కుమారుడు రామ్ చరణ్.., సోషల్ మీడియాలో జనసేనకు మద్దతు పలకగా.., వరుణ్ తేజ్, నిహారికా నేరుగా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. అల్లు అర్జున్ కూడా జనసేనకు మద్దతుగా ఓ బహిరంగ సభలో పాల్గొన్నారు. చిరంజీవి బహిరంగంగా మద్దతు పలకకపోయినా.., తమ్ముడికి నైతికి మద్దతు ఇస్తూనే ఉన్నారు. జనసేన వైపు ఉండాలని అభిమాన సంఘాలకు సూచించారు.
    Published by:Purna Chandra
    First published:

    అగ్ర కథనాలు