JANASENA LEADER NADENDLA MANOHAR HAS CRITICIZED THE JAGAN GOVERNMENT OVER THE HIKE IN SANKRANTI RTC BUS FARES SNR
పేదలపై మీకున్న ప్రేమ ఇదేనా..వైసీపీ సర్కార్‌పై జనసేన నేత సెటైర్
Andhra pradesh
Andhra pradesh: ఏపీఎస్ ఆర్టీసీ సంక్రాంతి బస్సు ఛార్జీల పెంపుపై జనసేన పార్టీ ఏపీ ప్రభుత్వంపై విమర్శలు ఎక్కుపెట్టింది. పండగకు వలసలు వెళ్లిన వాళ్ల సొంతూళ్లకు వస్తుంటే జేబులు గుల్ల చేయడం ఏమిటని ప్రశ్నిస్తోంది. పేద ప్రజలపై మీకున్న ప్రేమ ఇదేనా అంటూ వైసీపీ ప్రభుత్వానికి చురకలు అంటించారు ఆపార్టీ నేత నాదెండ్ల మనోహర్.
ఆంధ్రప్రదేశ్‌లో సినిమా టిక్కెట్లపై చెలరేగిన వివాదం చల్లబడ లేదు..మరోవైపు ఏపీఎస్ ఆర్టీసీ (Aps rtc)ఛార్జీల పెంపు అంశం హీటెక్కిస్తోంది. సంక్రాంతి పండుగ సందర్భంగా ఏపీఎస్ ఆర్టీసీ (Aps rtc)ప్రత్యేక బస్సులను నడుపుతామని ప్రకటించింది. సుమారు 7వేల బస్సులు తిప్పేందుకు నిర్ణయించింది వైసీపీ ప్రభుత్వం. పండుగ సీజన్‌ని దృష్టిలో పెట్టుకొని 50శాతం ఛార్జీ అదనంగా(50 Percent charge hike) వసూలు చేయనుంది ఏపీ ప్రభుత్వం. ఏపీఎస్ఆర్టీసీ సంక్రాంతి పండుగకు తిప్పే బస్సుల్లో ఛార్జీలు పెంచడంపై జనసేన పార్టీ (Janasena party)ఆగ్రహం వ్యక్తం చేసింది. పేద ప్రజలపై ప్రేమ ఉండటం అంటే వాళ్ల జేబులు గుల్ల చేయడమేనా అంటూ ప్రశ్నించారు జనసేన పార్టీ పొలిటికల్ అఫైర్స్ కమిటీ ఛైర్మెన్ (Political Affairs committee chairman)నాదెండ్ల మనోహర్ (Nadendla manohar).పనుల కోసం పొరుగు రాష్ట్రాలకు వలస వెళ్లి వాళ్లు పండుగకు ఆంధ్రాకు వస్తే బస్సు ఛార్జీలు 50శాతం పెంచి వాళ్లను దోచుకుంటారా అని ట్విట్టర్ (Twitter)వేదికగా ప్రశ్నించారు నాదెండ్ల మనోహర్. ఇది ఖచ్చితంగాపేద ప్రజల్ని దోచుకోవడమే అవుతుందంటూ ప్రభుత్వపై ఘాటు విమర్శలు చేశారు.
పేద ప్రజలపైన మీకున్న ప్రేమ ఇదేనా ..
రాష్ట్రంలో ఉపాధి లేక పక్క రాష్ట్రాలకు చాలా మంది వలస వెళ్తున్నారని పేర్కొన్నారు నాదెండ్ల మనోహర్. పేద ప్రజలపై ప్రేమను చాటుకోవడం అంటే పేద వాళ్ల దగ్గర అదనపు ఛార్జీలు వసూలు చేయడమేనా అంటూ వైసీపీ ప్రభుత్వంపై సెటైర్ వేశారు. ఈ సందర్భంగా నాదెండ్ల మనోహర్ ఏపీఎస్ ఆర్టీసీ సంక్రాంతి స్పెషల్ బస్సులపై 50శాతం అదనంగా ఛార్జీలు పెంచుతున్నట్లు ఏపీఎస్ ఆర్టీసీ ఈడీ కేఎస్ బ్రహ్మానందరెడ్డి చేసిన ప్రకటనను ట్విట్టర్లో లింక్ చేశారు. తమ సంక్రాంతి బస్సుల్లో బాదుడు లేదని తెలంగాణ ఆర్టీసీ ప్రచారం చేస్తోందంటే మీ దోపిడీ ఏ స్థాయిలో ఉందో అర్ధం చేసుకోమంటూ వైసీపీ ప్రభుత్వానికి చురకలు అంటించారు నాదెండ్ల మనోహర్.
పేద ప్రజలపై ప్రేమ ఉండటం అంటే ఆర్టీసీ సంక్రాంతి బస్సుల్లో ఛార్జీలు 50 % పెంచడమా @ysjaganగారూ? సంతోషంగా పండగకి ఊరు వచ్చే మన జనం జేబులు గుల్ల చేయడమేమిటి? తమ రాష్ట్ర సంక్రాంతి బస్సుల్లో బాదుడు లేదు అని తెలంగాణ ఆర్టీసీ ప్రచారం చేస్తోంది అంటే మీ దోపిడీ ఏ స్థాయిలో ఉందో అర్థమవుతోంది.
🙏🏻 pic.twitter.com/RS2hz4zAYG
టికెట్ ధరల పంచాయితీ ..
ఏపీలో ఇప్పటికే సినిమా టిక్కెట్ల విషయంలో అటు ప్రభుత్వానికి ..ఇటు తెలుగు చిత్ర పరిశ్రమ మధ్య కోల్డ్‌వార్ కొనసాగుతోంది. సినిమా టికెట్ ధర తగ్గించడం పేద ప్రజల కోసమే అని సీఎం స్వయంగా చెప్పారు. దానికి కౌంటర్‌గా డైరెక్టర్ రాంగోపాల్‌వర్మ పది ప్రశ్నలను ఏపీ ప్రభుత్వానికి సంధించారు. వర్మను సపోర్ట్ చేస్తూ నాగబాబు సైతం ట్వీట్ చేశారు. ఏపీలో సంక్రాంతి పండుగ వరకు ఈ సినిమా టికెట్ ధరలు, ఆర్టీసీ బస్ టికెట్ ఛార్జీల పెంపుపై డైలాగ్ వార్ కొనసాగేలా కనిపిస్తోంది.
Published by:Siva Nanduri
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.