జనసేనలో ‘విశాఖ’ టెన్షన్... ఆ నేత సీటుకు ఎసరు ?

పవన్ కళ్యాణ్(ఫైల్ ఫోటో)

పురంధేశ్వరి కోసం సిట్టింగ్ ఎంపీ కంభంపాటి హరిబాబును పక్కనపెట్టిన బీజేపీ... అంత ఈజీగా ఈ సీటును జనసేనకు వదులుతుందా అనే వాదన కూడా మొదలైంది.

 • Share this:
  రాజకీయాల్లో ఎవరు ఎన్ని చేసినా... ఫైనల్‌గా ఎన్నికల్లో గెలవడమే పార్టీల లక్ష్యం. ఈ విషయంలో ఎవరికీ ఎలాంటి సందేహాలు అవసరం లేదు. పొత్తులు పెట్టుకున్నా, అవగాహన కుదుర్చుకున్నా... అదంతా ఎన్నికల్లో గెలుపు కోసమే. ఏపీలో కొత్తగా పొడిచిన జనసేన, బీజేపీ పొత్తుకు కూడా కారణం ఇదే. రాబోయే ఎన్నికల నాటికి మూడో ప్రత్యామ్నాయంగా ఎదుగుతామని... జనసేన, బీజేపీ అగ్రనేతలు పొత్తు ఖరారు చేసుకున్న సమయంలోనే క్లారిటీ ఇచ్చారు. ఇంతవరకు బాగానే ఉన్నా... ఈ రెండు పార్టీల మధ్య వచ్చే ఎన్నికల్లో సీట్ల సర్దుబాటు ఏ రకంగా ఉంటుందనే అంశంపై అప్పుడే ఆసక్తికర చర్చ మొదలైంది.

  విశాఖ లోక్ సభ స్థానం నుంచి గత ఎన్నికల్లో జనసేన నుంచి సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ పోటీ చేయగా... బీజేపీ తరపున పురంధేశ్వరి బరిలోకి దిగారు. వీరిలో మూడో స్థానంలో లక్ష్మీనారాయణ, నాలుగో స్థానంలో పురంధేశ్వరి నిలిచారు. ఇప్పుడు ఈ రెండు పార్టీలు పొత్తు పెట్టుకోవడంతో... రాబోయే ఎన్నికల్లో విశాఖ లోక్ సభ సీటు ఎవరికి ఇస్తారనే దానిపై అప్పుడే చర్చ సాగుతోంది. రీసెంట్‌గా విశాఖ లోక్ సభ స్థానం జనసేన ఇంఛార్జ్‌గా లక్ష్మీనారాయణ నియమితులయ్యారు. దీంతో పవన్, లక్ష్మీనారాయణ మధ్య ఉన్న అభిప్రాయభేదాలు పూర్తిగా తొలిగిపోయాయనే టాక్ వినిపించింది.

  జనసేనలో ‘విశాఖ’ టెన్షన్... ఆ నేత సీటుకు ఎసరు ? | Janasena leader and cbi ex jd Lakshmi Narayana may face tough competition from purandeshwari regarding Visakhapatnam lok sabha seat ak
  లక్ష్మీనారాయణ, పురంధేశ్వరి(ఫైల్ ఫోటోలు)


  అయితే పురంధేశ్వరి కోసం సిట్టింగ్ ఎంపీ కంభంపాటి హరిబాబును పక్కనపెట్టిన బీజేపీ... అంత ఈజీగా ఈ సీటును జనసేనకు వదులుతుందా అనే వాదన కూడా మొదలైంది. విశాఖ నుంచి పోటీ చేయడానికే గత కొన్నేళ్లుగా మొగ్గు చూపుతున్న పురంధేశ్వరి... రాబోయే ఎన్నికల్లోనూ విశాఖ వైపే మొగ్గుచూపుతారనే ప్రచారం కూడా జరుగుతోంది. అదే జరిగితే జనసేన నుంచి గత ఎన్నికల్లో విశాఖ ఎంపీ రేసులో నిలిచిన లక్ష్మీనారాయణకు సీటు దక్కే ఛాన్స్ లేనట్టే అనే గుసగుసలు కూడా వినిపిస్తున్నాయి. మొత్తానికి బీజేపీ, జనసేన పొత్తు కారణంగా విశాఖ ఎంపీ సీటు విషయంలో ఈ రెండు పార్టీలు ఎలా వ్యవహరిస్తాయన్నది ప్రస్తుతానికి సస్పెన్సే.
  Published by:Kishore Akkaladevi
  First published: