ఇసుక కొరత సమస్యపై జనసేన చేపట్టిన లాంగ్ మార్చ్ కార్యక్రమం సక్సెస కావడంతో... ఆ పార్టీ శ్రేణుల్లో నూతనోత్సాహం నెలకొంది. లాంగ్ మార్చ్ సక్సెస్‌తో మళ్లీ తాము ప్రజల్లోకి వెళ్లేందుకు అనువైన వాతావరణం ఏర్పడిందని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు. ఇదిలా ఉంటే... ఈ కార్యక్రమం ద్వారా జనసేనకు మరో విషయంలో స్పష్టత వచ్చిందని ఆ పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. గత ఎన్నికల్లో విశాఖ లోక్‌సభ అభ్యర్థిగా పోటీ చేసిన సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ... కొంతకాలంగా పార్టీ మారతారనే ఊహాగానాలు వినిపించాయి. వాటిని ఆయన తోసిపుచ్చినప్పటికీ... లక్ష్మీనారాయణ జనసేనలో కొనసాగుతారా ? లేదా ? అనే విషయం లాంగ్ మార్చ్‌తో తేలిపోతుందని ఆ పార్టీ శ్రేణులు భావించాయి.
అయితే తాను జనసేనలోనే కొనసాగుతానని గతంలో క్లారిటీ ఇచ్చిన లక్ష్మీనారాయణ... లాంగ్ మార్చ్‌లో పాల్గొన్నారు. చేతికి కట్టుతో ఆయన ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. లాంగ్ మార్చ్‌తో పాటు విశాఖపట్నం జిల్లాలో జనసేన నుంచి పోటీ చేసిన అభ్యర్థులు, ముఖ్య నాయకులతో జనసేన అధ్యక్షులు పవన్ కల్యాణ్ నిర్వహించిన సమీక్షలోనూ ఆయన పాల్గొన్నారు. మొత్తానికి లాంగ్ మార్చ్ ద్వారా లక్ష్మీనారాయణ మళ్లీ జనసేనలోనే కొనసాగుతున్నారని స్పష్టమైంది.
Published by:Kishore Akkaladevi
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.