అచ్చెన్నాయుడు అరెస్ట్‌పై జనసేన సందేహాలు

అవినీతి ఆరోపణల కారణంగా టీడీపీ సీనియర్ నేత, కార్మికశాఖ మాజీమంత్రి అచ్చెన్నాయుడును ఏసీబీ అరెస్ట్ చేయడంపై జనసేన స్పందించింది.

news18-telugu
Updated: June 12, 2020, 4:13 PM IST
అచ్చెన్నాయుడు అరెస్ట్‌పై జనసేన సందేహాలు
అచ్చెన్నాయుడు (File)
  • Share this:
అవినీతి ఆరోపణల కారణంగా టీడీపీ సీనియర్ నేత, కార్మికశాఖ మాజీమంత్రి అచ్చెన్నాయుడును ఏసీబీ అరెస్ట్ చేయడంపై జనసేన స్పందించింది. అచ్చెన్నాయుడు అరెస్టు అవినీతికి పాల్పడినందుకా? లేదా రాజకీయ కక్ష సాధింపు కోసమా అనే విషయంలో వైసీపీ సర్కార్ తన చిత్తశుద్దిని నిరూపించుకోవాలని జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ తెలిపారు. ఈ మేరకు ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. అవినీతి ఏ రూపంలో ఉన్నా దానికి బాధ్యులు ఎంతటి వారైనా జనసేన తీవ్రంగా వ్యతిరేకిస్తుందని స్పష్టం చేశారు. అయితే అసెంబ్లీ సమావేశాలకు నాలుగైదు రోజుల ముందు అచ్చెన్నాయుడును అరెస్టు చేయడం సందేహాలకు తావిస్తోందని అన్నారు.అదే విధంగా ఒక శాసనసభ్యుడిని అరెస్ట్ చేసే ముందు రాజ్యాంగ నియమ నిబంధనలను పాటించవలసిన అవసరం ప్రభుత్వంపై ఉందని తెలిపారు. అచ్చెన్నాయుడు అరెస్టులో అవి లోపించినట్లు కనిపిస్తున్నాయని ఆరోపించారు. ఈఎస్ఐలో జరిగిన అవకతవకలతోపాటు ఇప్పటి వరకు జరిగిన అన్ని అక్రమాలపై దర్యాప్తు జరిపించాలని జనసేన డిమాండ్ చేస్తోందని తెలిపారు.
First published: June 12, 2020, 1:56 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading