సీఎం జగన్‌పై సంచలన వ్యాఖ్యలు చేసిన పవన్ కల్యాణ్

ప్రధాని మోదీ సంవత్సరం అంతా తిరుగుతున్నారని చెప్పిన పవన్, చంద్రబాబు, లోకేశ్ లు తిరుగుతున్నారా? అని ప్రశ్నించారు పవన్ కల్యాణ్,

news18-telugu
Updated: July 31, 2019, 3:48 PM IST
సీఎం జగన్‌పై సంచలన వ్యాఖ్యలు చేసిన పవన్ కల్యాణ్
పవన్ కల్యాణ్, వైఎస్ జగన్
news18-telugu
Updated: July 31, 2019, 3:48 PM IST
జనసేన అధినేత పవన్ కల్యాణ్.. సీఎం జగన్ మోహన్ రెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజమహేంద్రవరంలోని జనసేన పార్టీ కార్యాలయంలో మాట్లాడుతూ... కీలక వ్యాఖ్యలు చేశారు పవన్. జగన్ పై కేసులు కనుక లేకపోతే, ఆయన తిరిగే వారు కాదని, కూర్చునే రాజకీయం చేసేవారని అభిప్రాయపడ్డారు జనసేనాని. ప్రధాని మోదీ సంవత్సరం అంతా తిరుగుతున్నారని చెప్పిన పవన్, చంద్రబాబు, లోకేశ్ లు తిరుగుతున్నారా? వీళ్లెవరూ తిరగరని విమర్శించారు.
ప్రజల మధ్య నాయకులు ఉండాలని, ప్రతిరోజూ ప్రజలను కలిసేందుకు తిరగాలని జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సూచించారు.

వైఎస్ రాజశేఖర్ రెడ్డి చనిపోయిన తర్వాత జగన్ సీఎం చేయాలని అప్పట్లో ఎక్కువ మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కొరుకున్నారన్నారు. అలా జగన్ ముఖ్యమంత్రి కాలేకపోయారు కాబట్టి జగన్ రోడ్లపై తిరగబడి కష్టపడ్డారన్నారు. జగన్ పడ్డ ఆ కష్టాన్ని తానేమీ కాదనడం లేదన్నారు పవన్. తాను కూడా రోడ్లపై తిరిగేందుకు సిద్ధంగా ఉన్నాను కానీ, ‘అభిమానులు నన్ను తిరగినిస్తారా?’అంటూ పవర్ స్టార్ ప్రశ్నించారు. తన చొక్కానే కాదు, తన శరీరాన్నీ ముక్కలు ముక్కలుగా అభిమానులు పీక్కుపోతారన్నారు. రోడ్డుపై తానొస్తే... వచ్చే ప్రజలను, అభిమానులను అదుపు చేయలేక తన సెక్యూరిటీ అలసిపోతారన్నారు.

అందుకే రోడ్లపైకి రావాలంటే ఇన్ని ఆలోచించాల్సి వస్తుందన్నారు పవన్ లక్యాణ్, అలా అని ప్రజల కోసం రొడ్లపైకి రాకుండా ఉండనని స్పష్టం చేశారు. తాజాగా పవన్... సీఎం జగన్‌పై చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్‌గా మారాయి. మరి దీనిపై సీఎం ఎలా స్పందిస్తారో ..ఎలాంటి కౌంటర్ ఇస్తారో వేచి చూడాల్సిందే. ప్రస్తుతం జగన్ జెరూసలేం పర్యటన నిమిత్తం బిజీగా ఉన్నారు.

First published: July 31, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...