వైసీపీ సోషల్ మీడియాపై పవన్ కల్యాణ్ ఫైర్

వైసీపీ సోషల్ మీడియాపై సైబర్ క్రైం పోలీసులకు జనసేన పార్టీ ఫిర్యాదు చేసుందుకు సిద్ధమవుతుంది. ఆ పార్టీకి లీగల్ నోటీసులు కూడా ఇవ్వాలని జనసేన నిర్ణయించినట్లు సమాచారం.

news18-telugu
Updated: August 23, 2019, 11:13 AM IST
వైసీపీ సోషల్ మీడియాపై పవన్ కల్యాణ్ ఫైర్
పవన్ కళ్యాణ్ (Image:Janasena Party/Twitter)
  • Share this:
వైసీపీ అవాస్తవ ప్రచారాలు చేస్తుందంటూ మండిపడ్డారు జనసేన అధినేత పవన్ కల్యాణ్.  ఈ అంశంపై చట్టపరమైన చర్యలు సిద్ధమవుతున్నారు జనసేననాని.  వైసీపీ సోషల్ మీడియాపై సైబర్ క్రైం పోలీసులకు జనసేన పార్టీ ఫిర్యాదు చేసుందుకు సిద్ధమవుతుంది. ఆ పార్టీకి లీగల్ నోటీసులు కూడా ఇవ్వాలని జనసేన నిర్ణయించుకున్నట్లు సమాచారం. పవన్ కల్యాణ్ అభిమానుల ముసుగులో బ్లాక్ మనీని వైట్ మనీగా మార్చేందుకు ప్రయత్నించారంటూ... వైసీపీ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. దీనిపై పవన్ కల్యాణ్‌తో పాటు ఆయన అభిమానులు, జనసేన కార్యకర్తలు మండిపడుతున్నారు.

‘పవన్ కల్యాణ్ బర్తడే రోజు దాదాపు 2000 కోట్ల బ్లాక్ మనీని వైట్ మనీని మార్చేందుకు అమరావతిలో తానా వర్గం ఉన్నట్లు సమాచారం. అందుకే పవన్ అభిమానుల ముసుగులో విరాళాలు వసూలు చేసి వాటికి చంద్రబాబు ఇచ్చిన బ్లాక్ మనీ కలిపి వాటిని వైట్ మనీగా మార్చడానికి పక్కా పథకాన్ని ప్లాన్ చేసినట్టు ఇప్పటికే కొంతమంది పవన్ అభిమానులు గుర్తించి తీవ్ర నిరాశతో ఉన్నారు’అని వైసీపీ పార్టీ తన సోషల్ మీడియా ఎకౌంట్లో పోస్టు చేసింది.

First published: August 23, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు