సీఎం కేసీఆర్‌కు జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ స్పెషల్ బర్త్ డే విషెస్..

సీఎం కేసీఆర్ పుట్టిన రోజు సందర్భంగా జనసేన నేత పవన్ కల్యాణ్ ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపారు.

news18-telugu
Updated: February 17, 2020, 5:15 PM IST
సీఎం కేసీఆర్‌కు జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ స్పెషల్ బర్త్ డే విషెస్..
పవన్ కళ్యాణ్, కేసీఆర్ (ఫైల్ ఫొటో)
  • Share this:
సీఎం కేసీఆర్ 66వ జన్మదిన వేడుకలు తెలంగాణలో ఘనంగా జరుగుతున్నాయి. కేసీఆర్ పుట్టిన రోజును టీఆర్ఎస్ శ్రేణులు పండగలా సెలబ్రేట్ చేసుకుంటున్నాయి. ఇక సీఎం కేసీఆర్‌కు పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు ప్రత్యేకంగా పుట్టిన రోజు శుభాకాంక్షలు చెబుతున్నారు. తాజాగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ ట్వీట్ చేశారు. 'గౌరవనీయులు, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్ గారికి జన్మదినోత్సవ శుభాకాంక్షలు. మీకు ఆ భగవంతుడు సంపూర్ణ ఆయుష్షును, ఆరోగ్యాన్ని అనుగ్రహించాలని కోరుకుంటున్నాను.' అని ట్విటర్‌లో పేర్కొన్నారు పవన్ కల్యాణ్.

అంతకుముందు ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు కూడా కేసీఆర్‌కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు.

First published: February 17, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు