అమరావతి వివాదం.. పవన్ కళ్యాణ్ కీలక నిర్ణయం...

Pawan Kalyan on Amaravati | ప్రభుత్వాలు మారినప్పుడల్లా రాజధానులు మార్చుకుంటూ పోతే మన ఉనికికే ప్రమాదం ఏర్పడుతుందని పవన్ కళ్యాణ్ అన్నారు.

news18-telugu
Updated: August 24, 2019, 8:14 PM IST
అమరావతి వివాదం.. పవన్ కళ్యాణ్ కీలక నిర్ణయం...
పవన్, జగన్, చంద్రబాబు
  • Share this:
అమరావతిపై ఆంధ్రప్రదేశ్‌లో తీవ్ర దుమారం రేగుతోంది. మంత్రి బొత్స సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలు అటు రాజకీయవర్గాల్లోనే కాకుండా సామాన్య ప్రజానీకంలో కూడా చర్చనీయాంశంగా మారాయి. అయితే, అమరావతి వివాదంలోకి ఇప్పుడు పవన్ కళ్యాన్ ఎంట్రీ అయ్యారు. తనను కలిసిన అమరావతి రైతులతో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈనెల 30, 31 తేదీల్లో అమరావతిలో పర్యటించాలని నిర్ణయించారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని నిర్మాణం అమరావతిలోనే జరగాలని ఆయన స్పష్టం చేశారు. ప్రభుత్వాలు మారినప్పుడల్లా రాజధానులు మార్చుకుంటూ పోతే మన ఉనికికే ప్రమాదం ఏర్పడుతుందన్నారు. ఇలాంటి అనాలోచిత నిర్ణయాల వల్ల పెట్టుబడులు రాకపోగా నిరుద్యోగం పెరిగిపోతుందని పవన్ కళ్యాణ్ అభిప్రాయపడ్డారు. ఒకసారి ఏపీని విడగొట్టి రాజధాని లేకుండా చేశారని, మళ్లీ ఇప్పుడు రాజధాని అమరావతి కాదు మరోచోట అంటే ఉనికే ప్రశ్నార్థకం అవుతుందన్నారు. మంత్రులు, ప్రజాప్రతినిధులు రైతులను గందరగోళ పరిచే ప్రకటనలు చేయకూడదని సూచించారు. రాజధాని కోసం భూములిచ్చిన రైతులకు తాము అండగా ఉంటామని జనసేన అధినేత హామీ ఇచ్చారు. రాష్ట్రం కోసం తాము భూములిచ్చామని, ఓ పార్టీకో, కులానికో తాము భూములివ్వలేదని రైతులు పవన్ కళ్యాణ్‌కు తెలిపారు. భూములు ఇచ్చిన రైతుల్లో 11 కులాలకు చెందిన వారు ఉన్నారన్నారు.

First published: August 24, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు