Home /News /politics /

JANASENA CHIEF PAWAN KALYAN WILL ENTER INTO ANDHRA PRADESH ASSEMBLY SAYS LAGADAPATI RAJAGOPAL BA

పవన్ కళ్యాణ్ అసెంబ్లీలో అడుగు పెట్టడం ఖాయం.. లగడపాటి జోస్యం

పవన్ కళ్యాణ్,

పవన్ కళ్యాణ్,

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కచ్చితంగా అసెంబ్లీలో అడుగుపెడతారని చెప్పిన లగడపాటి రాజగోపాల్ చిరంజీవి కంటే తక్కువ ప్రభావం చూపిస్తారని చెప్పారు.

    జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కచ్చితంగా అసెంబ్లీలో అడుగుపెడతారని ఆంధ్ర ఆక్టోపస్ లగడపాటి రాజగోపాల్ స్పష్టం చేశారు. అమరావతిలో లగడపాటి రాజగోపాల్ మీడియాతో మాట్లాడారు. ‘అమరావతి రాజధాని ప్రాంతంలో చెబుతున్నా. ఇక్కడ ఉన్న అసెంబ్లీలోకి పవన్ కళ్యాణ్ అడుగుపెట్టడం ఖాయం.’ అని లగడపాటి అన్నారు. అయితే, జనసేనకు ఎన్ని సీట్లు వస్తాయనే విషయాన్ని మాత్రం లగడపాటి చెప్పలేదు. మెగాస్టార్ చిరంజీవి సారధ్యంలో వచ్చిన ప్రజారాజ్యం కంటే తక్కువ ప్రభావం ఉంటుందని ఆయన అభిప్రాయపడ్డారు. జనసేన అధినేత పవన్ కళ్యాన్ ఏప్రిల్ 11న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో రెండు చోట్ల నుంచి పోటీ చేశారు. విశాఖ జిల్లాలోని గాజువాక, పశ్చిమ గోదావరి జిల్లాలోని భీమవరం నియోజకవర్గాల నుంచి పవన్ కళ్యాణ్ పోటీ చేశారు. అయితే, పవన్ కళ్యాణ్ రెండుచోట్లా ఓడిపోతారంటూ ఎన్నికల తర్వాత పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. భీమవరంలోనే కాదు గాజువాకలో కూడా పవర్ స్టార్‌కు చుక్కెదురు అవుతుందంటూ ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ అసెంబ్లీలో అడుగుపెట్టడం ఖాయమంటూ లగడపాటి చెప్పడం జనసేన అభిమానుల్లో ఉత్సాహం నింపనుంది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కచ్చితంగా అసెంబ్లీలో అడుగుపెడతారని చెప్పిన లగడపాటి రాజగోపాల్ చిరంజీవి కంటే తక్కువ ప్రభావం చూపిస్తారని చెప్పారు.
    First published:

    Tags: Andhra Pradesh Assembly Election 2019, Andhra Pradesh Lok Sabha Elections 2019, Janasena party, Lagadapati, Pawan kalyan

    తదుపరి వార్తలు