Home /News /politics /

JANASENA CHIEF PAWAN KALYAN WILL CAST HIS VOTE IN EAST VIJAYAWADA IN MUNICIPAL ELECTIONS NGS

AP Municipal Elections:మున్సిపల్ ఎన్నికల ప్రచార బరిలో దిగని పవన్ కళ్యాణ్.. రేపు ఓటేసేది ఎక్కడో తెలుసా?

పవన్ కళ్యాణ్ ఓటేసేది ఎక్కడ

పవన్ కళ్యాణ్ ఓటేసేది ఎక్కడ

ఎన్నికల ప్రచారానికి దూరంగా ఉన్న పవన్ కళ్యాణ్ ను ప్రత్యక్షంగా చూడాలని అభిమానులు, జనసేన అభ్యర్థులు ఆరాటపడుతున్నారు. అయితే రేపు ఓటు హక్కు వేసేందుకు పవన్ వస్తున్నారు.. దీంతో ఆయన ఎక్కడ ఓటు వేస్తున్నారంటూ మెగా అభిమానులు సెర్చ్ చేయడం మొదలబెట్టారు.

ఇంకా చదవండి ...
    రేపు ఏపీ వ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికలకు ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. అధిక మున్సిపాలిటీల్లో చాలా గ్యాప్ తరువాత ఎన్నికలు రుగుతున్నాయి. ఈ ఎన్నికల్లో  జనసేన అభ్యర్థులు తొలిసారి బరిలో దిగుతున్నారు.. మరోవైపు మున్సిపల్ ఎన్నికల్లో  పవన్ తొలిసారి ఓటు హక్కు వినియోగించుకోబోతున్నారు.

    ప్రస్తుతం ఏపీలో పవన్ ఎక్కడి నుంచి ఓటు వేస్తున్నారు అన్నది ఆసక్తికరంగా మారింది. దీనిపై ఇప్పటికే ఆయన అభిమానులు, నెటిజన్లు గూగుల్ సెర్చ్ లో వెతుకుతున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం అందిన సమాచారం ప్రకారం విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ లో..  ఉదయం 7 నుంచి 8 గంటల మధ్యలో పవన్ కళ్యాణ్ తన ఓటు హక్కును వినియోగించుకోబోతున్నట్టు తెలుస్తోంది.

    పడమట లంకలోని కొమ్మ సీతారామయ్య జెడ్పి బాలికల పాఠశాలలో పవన్ తన ఓటు హక్కు వినియోగించుకోబోతున్నారు. పడమట లంకలో అప్పుడే సందడి మొదలైంది. పవన్ ఓటేయడానికి వస్తున్నారని అని తెలియడంతో భారీగా పవన్ చూసేందుకు అతడి ఫ్యాన్స్ భారీ ఎత్తున అక్కడకు చేరేందుకు సిద్ధమవుతున్నారు.  పోలీసులు ముందుగానే పెద్ద ఎత్తున ఆ ప్రాంతంలో భద్రతా ఏర్పాట్లు చేశారు. ఎవరూ గుమికూడకుండా ఉండే విధంగా చర్యలు తీసుకుంటున్నారు.

    ప్రస్తుతం పవన్ వరుస సినిమాలో బిజీగా ఉన్నారు. అయినా మున్సిపల్ ఎన్నికల్లో ఆయన తమ పార్టీ అభ్యర్థుల తరపున ప్రచారం చేస్తారని అంతా భావించారు. మొదట షెడ్యూల్ కూడా ఫిక్స్ అయినట్టు తెలుస్తోంది. బీజేపీ, జనసేన పొత్తుగా పోటీ చేయడంతో రెండు పార్టీల తరుపున పవన్ ప్రచారం చేస్తున్నట్టు అభిమానులకు సమాచారం అందింది. కనీసం గత ఎన్నికల్లో తాను విశాఖలోని గాజువాక నుంచి పోటీ చేయడంతో.. విశాఖలో కచ్చితంగా ప్రచారం చేయడానికి వస్తారని ఆ పార్టీ అభ్యర్థులు భావించారు. బీజేపీ నేతలు కూడా పవన్ ప్రచారానికి వెళ్తే.. అభ్యర్థులకు కాస్త బూస్ట్ ఉంటుందని భావించారు..

    పవన్ మాత్రం మున్సిపల్ ఎన్నికల ప్రచారానికి దూరంగా ఉన్నారు. ఓ వైపు టీడీపీ అధినేత జగన్, జాతీయ కార్యదర్శి లోకేష్, ఎమ్మెల్యే బాలయ్య ఆ పార్టీ తరపున విరామం లేకుండా ప్రచారం చేశారు. ఇటు అధికార పార్టీ తరపున సీఎం జగన్ మినహా, కీలక మంత్రులు, నేతలు, ఎంపీలు అంతా ప్రచారంలో బిజీ అయ్యారు. అయితే పవన్ మాత్రం ప్రచారానికి రాకపోవడంపై ఆరోపణలు వెల్లువెత్తాయి..

    మున్సిపల్ ఎన్నికల్లో జనసేనా, బీజేపీలకు డిపాజిట్లు కూడా రావని తెలియడంతోనే ఆ పార్టీలో ప్రధాన నేతలు ప్రచారానికి రావడం లేదని ప్రత్యర్థులు ఆరోపణలు చేశారు. మరోవైపు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు కేంద్రం ఫిక్స్ అవ్వడంతో.. ప్రచారంలో ప్రజలకు ఏం చెప్పాలో తెలియకే పవన్ ప్రచారానికి రాలేదని ప్రత్యర్థి పార్టీలు ఆరోపిస్తున్నాయి. కారణం ఏదైనా పవన్ ప్రచారం చేయకపోవడంతో అభ్యర్థులకు కాస్త మైనస్సే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.
    Published by:Nagesh Paina
    First published:

    Tags: Andhra Pradesh, Ap local body elections, Bjp-janasena, Janasena, Municipal Elections, Pawan kalyan, Vijayawada

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు