సీఎం జగన్‌కు పవన్ కళ్యాణ్ బెదిరింపులు?

బీజేపీ పెద్దలతో తనకు పెద్ద ఎత్తున పరిచయాలు ఉన్నాయని పవన్ కళ్యాణ్ అన్నారు. అమరావతి రైతుల తరఫున నరేంద్ర మోదీ, అమిత్ షాను కలసి ఇక్కడి వాస్తవాలను వివరిస్తానని చెప్పారు.

news18-telugu
Updated: August 31, 2019, 7:23 PM IST
సీఎం జగన్‌కు పవన్ కళ్యాణ్ బెదిరింపులు?
పవన్, జగన్
news18-telugu
Updated: August 31, 2019, 7:23 PM IST
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బెదిరిస్తున్నారా? మంగళగిరిలోని జనసేన కార్యాలయంలో పవన్ కళ్యాణ్ మాట్లాడిన మాటలు చూస్తుంటే అలాగే అనిపిస్తోంది. అయితే, ఆయన ప్రధాని మోదీ, అమిత్ షా పేరు చెప్పి భయపెడుతున్నారా? అనే సందేహం రాజకీయవర్గాల్లో కలుగుతోంది. ‘అమరావతికి శంకుస్థాపన చేసింది మోదీనే. అమరావతిని కాదన్నారంటే మోదీని వ్యతిరేకిస్తున్నట్టే. అమిత్ షాను వ్యతిరేకిస్తున్నట్టే.’ అని పవన్ కళ్యాణ్ అన్నారు. బీజేపీ పెద్దలతో తనకు పెద్ద ఎత్తున పరిచయాలు ఉన్నాయని పవన్ కళ్యాణ్ అన్నారు. అమరావతి రైతుల తరఫున పోరాటం చేస్తానని స్పష్టం చేశారు. స్థానికంగా పోరాటంతో జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం స్పందించకపోతే తన పరిచయాలతో ఢిల్లీకి వెళతానని చెప్పారు. అమరావతి రైతుల తరఫున నరేంద్ర మోదీ, అమిత్ షాను కలసి ఇక్కడి వాస్తవాలను వివరిస్తానని చెప్పారు. నరేంద్ర మోదీ గురించి తనకు తెలుసన్న పవన్ కళ్యాణ్.. ఆయన అవినీతి, అధికార దుర్వినియోగాన్ని సహించే వ్యక్తి కాదన్నారు. జగన్ మీద ఓ కన్ను ఉందని, జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. అయితే, ఈ గందరగోళంలో పడి రైతులు తొందపడి స్థలాలు అమ్ముకోవద్దని సూచించారు. నరేంద్ర మోదీ తలుచుకుంటే ఎప్పుడైనా ఎన్నికలు రావొచ్చని, అప్పుడు వైసీపీ ప్రభుత్వం ఉండకపోవచ్చన్నారు.

First published: August 31, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...