Janasena Party: జనసేనలోకి ఇద్దరు మాజీ మంత్రులు.. ఒక మాజీ ఎమ్మెల్యే..? పవన్ స్ట్రాటజీ ఇదేనా..?

పవన్ కల్యాణ్ (ఫైల్)

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాజకీయాల్లో (AP Politics) ఇటీవల జనసేన పార్టీపై (Janasena Party) ఆసక్తికర చర్చ జరుగుతోంది. రాజమండ్రి సభలో ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan) చేసిన ప్రసంగం ఓ రంకంగా సంచలనంగా మారింది.

 • Share this:
  P.Anand Mohan, Visakhapatnam, News18

  ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాజకీయాల్లో (AP Politics) ఇటీవల జనసేన పార్టీపై (Janasena Party) ఆసక్తికర చర్చ జరుగుతోంది. రాజమండ్రి సభలో ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan) చేసిన ప్రసంగం ఓ రంకంగా సంచలనంగా మారింది. తన పొలిటికల్ ప్లాన్స్ చెప్పకనే చెప్పిన పవన్ కొంతమంది ముఖ్యనేతలను పార్టీలోకి తీసుకొచ్చేందుకు యత్నిస్తున్నట్లు టాక్. వీరిలో ఇద్దరు మాజీ మంత్రులు, ఓ మాజీ ఎమ్మెల్యే ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. వీరిలో ఒకరు ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్నారు కూడా. మెగా ఫ్యామిలీతో కూడా సదరు ముఖ్యనేతకు మంచి సంబంధాలున్నాయి. గతంలో ఆయన్ను వ్యతిరేకించిన పవన్.. ఇప్పుడు గేట్లు ఓపెన్ చేసినట్లు తెలుస్తోంది. ఆ ముఖ్యనేతే... టీడీపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు (Ganta Srinivasa Rao). ఆయన రాకతో ఉత్తరాంధ్రలో పార్టీ బలోపేతమవడమేకాకుండా.. ఆర్ధికంగా అండగా ఉంటారని భావిస్తున్నట్లు తెలుస్తోంది.

  కొంతకాలంగా రాజకీయ భవిష్యత్తుపై సీరియస్ గా ఆలోచిస్తున్న గంటా... ఇప్పుడు జోష్ ఉన్న జనసేన పార్టీకి ఆయన షిఫ్ట్ అవ్వాలని ప్రయత్నిస్తున్నారట. ఈ విషయం మొన్నే లీక్ అయ్యింది. విషయాన్ని లీకుచేసే లీకువీరులు కూడా ఆశ్చర్యపోయేలా ఉన్నాయా నిజాలు. ప్రధానం ఒక సామాజిక వర్గం ఎదుగుదల.. ఆ సామాజిక వర్గం కోసం పాటుపడటం వంటివే జనసేన పార్టీకి ఎజెండాలు. కానీ.. అదే సామాజిక వర్గం నేతగా తన చివరి అస్త్రాన్ని ప్రయోగించారు ఆ నేత. అదే గంటా స్టైల్.

  ఇది చదవండి: వంగవీటి రాధా సంచలన వ్యాఖ్యలు... సేమ్ టు సేమ్ పవన్ లాగానే..!


  జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇప్పుడు తన పార్టీని బలోపేతం చేసుకునే విధంగా అడుగులు వేస్తూ కొంతమంది కీలక నాయకులు పార్టీలోకి తీసుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే కొంత మంది అగ్ర నాయకులతో కూడా పవన్ కళ్యాణ్ ఇటీవలి కాలంలో చర్చలు జరుపుతున్నారని కామెంట్లు ఎక్కువగా వినబడుతున్నాయి కొంత మంది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు అలాగే గతంలో కాంగ్రెస్ పార్టీలో కీలకంగా వ్యవహరించిన నాయకులు అలాగే ప్రజారాజ్యం పార్టీలో చిరంజీవి అండగా నిలబడిన వాళ్ళ మీద ఎక్కువగా దృష్టి సారించారని అంటున్నారు.

  ఇది చదవండి: కాపులకు పవన్ కల్యాణ్ హితబోధ.. ఆ ముగ్గురిపై ఆసక్తికర వ్యాఖ్యలు


  విశాఖ ఉత్తర నియోజకవర్గ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు మీద ఎక్కువగా దృష్టి సారించారని చెప్పుకొచ్చారు. గంటా శ్రీనివాసరావు ఆర్థికంగా బలంగా ఉండటమే కాకుండా కాపు సామాజికవర్గంలో ఆయనకు మంచి పట్టు ఉన్న సంగతి తెలిసిందే. దీంతో ఆయన విషయంలో సానుకూలంగా ఉన్నారని ఆయన తో పవన్ కళ్యాణ్ మాట్లాడాలని అనుకుంటున్నారని అంటున్నారు. అలాగే బిజెపి మాజీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు మీద కూడా పవన్ కళ్యాణ్ ఎక్కువగా దృష్టి పెట్టారని వ్యాఖ్యలు వినపడుతున్నాయి. అయితే వీరిద్దరిలో గంటా పైనే ఎక్కువ దృష్టి ఉండే అవకాశం ఉంది. కారణం సామాజికవర్గం నేత. గతంలో ప్రజారాజ్యం పార్టీలో కూడా అసోసిసియేట్ కావడం వంటికి ఇక్కడ కారణాలుగా చెప్పారు.

  ఇది చదవండి: ఏపీలో స్కూళ్ల మూత తప్పదా... ఒకే బడిలో 72మంది విద్యార్థులకు పాజిటివ్...


  ఆయనతో కూడా త్వరలో చర్చ జరిగే అవకాశాలు ఉండవచ్చని అంటున్నారు. విష్ణుకుమార్ రాజు కొంతమంది కీలక నాయకులను బీజేపీ నుంచి బయటకు తీసుకు రావచ్చు అని కూడా అంటున్నారు. అలాగే కృష్ణా జిల్లాకు చెందిన కామినేని శ్రీనివాసును కూడా ఆయన పార్టీలో తీసుకునే అవకాశం ఉండవచ్చని తెలుస్తుంది. కామినేని శ్రీనివాస్ కు పార్టీలో ముఖ్య బాధ్యతలు అప్పగించే అవకాశాలు ఉండవచ్చని అంటున్నారు. కమ్మ సామాజిక వర్గాన్ని దగ్గర చేసుకునే ప్రయత్నం చేస్తున్నారని వ్యాఖ్యలు వినపడుతున్నాయి. మరి భవిష్యత్ పరిణామాలు ఏ విధంగా ఉండబోతున్నాయి ఏంటి అనేది చూడాలి.P
  Published by:Purna Chandra
  First published: