• HOME
 • »
 • NEWS
 • »
 • POLITICS
 • »
 • JANASENA CHIEF PAWAN KALYAN TO VISIT DIVIS LAB EFFECTED VILLAGES IN EAST GODAWARI DISTRICT PRN

Pawan Kalan: మరో పర్యటనకు సిద్ధమైన పవన్ కల్యాణ్.., ఉద్యమానికి జనసేనాని మద్దతు..!

Pawan Kalan: మరో పర్యటనకు సిద్ధమైన పవన్ కల్యాణ్.., ఉద్యమానికి జనసేనాని మద్దతు..!

పవన్ కల్యాణ్ (ఫైల్)

జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ (Janasena Chief Pawan Kalyan( ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లోని తూర్పుగోదావరి జిల్లా (East Godawari) లో పర్యటించేందుకు సిద్ధమయ్యారు. దివీస్ ల్యాబ్ (Divi's Lab) కు వ్యతిరేకంగా జరగుతున్న ఉద్యమానికి పవన్ పద్దతివ్వనున్నారు.

 • Share this:
  జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ ఆంధ్రప్రదేశ్ లోని తూర్పుగోదావరి జిల్లాలో పర్యటించేందుకు సిద్ధమయ్యారు. ఈనెల 9న ఆయన తుని నియోజకవర్గంలో తొండంగి ప్రాంతంలో ఏర్పాటవుతున్న దివిస్‌ ఫార్మా ప్రభావిత గ్రామాల్లో పవన్ పర్యటించనున్నారు. దివీస్ ల్యాబ్ కు వ్యతిరేకంగా స్థానికులు చేపడుతున్న ఆందోళనలకు పవన్ మద్దతు పలకనున్నారు. ఈనెల 9వ తేదీ మధ్యాహ్నం ఒంటిగంటకు పవన్ తుని చేరుకుంటారు. అక్కడి నుంచి దివీస్ పరిశ్రమ వల్ల ఎక్కువ ప్రభావితమయ్యే దానవాయిపేట, కొత్తపాక పరిసర ప్రాంతాల్లో పర్యటిస్తారు. అలాగే ఆందోళన చేస్తున్న స్థానికులను, పోలీస్ లాఠీ ఛార్జ్ లో గాయపడ్డవారిని పవన్ పరామర్శిస్తారు. అనంతరం మధ్యాహ్నం 2గంటలకు నిర్వహించే బహిరంగ సభలో ఆయన పాల్గొంటారు.

  దివీస్ పై రాజకీయ వివాదం

   ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో దివీస్ లేబరేటరీస్ వ్యవహారం తొలి నుంచీ చిచ్చు రేపుతోంది. తూర్పుగోదావరి జిల్లా, తొండంగి సమీపంలోని దివీస్ సంస్థ ఏర్పాటు చేయబోతున్న కొత్త యూనిట్ పై అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ మాటల యుద్ధం కొనసాగుతూనే ఉంది. అధికారంలో ఉన్నప్పుడు అనుమతులిచ్చిన టీడీపీ ఇప్పుడు వ్యతిరేకిస్తోంది. అలాగే అపట్లో దివీస్ ల్యాబ్ ను ఎట్టిపరిస్థితుల్లో నిలిపేస్తామంటూ ఎన్నికల్లో హామీ ఇచ్చిన వైసీపీ తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత మాట మార్చింది.

  దేశీయ ఫార్మారంగంలో దిగ్గజమైన దివీస్ ల్యాబరేటరీస్ సంస్థ తూర్పుగోదావరి జిల్లా, తుని నియోజకవర్గ పరిధిలోబవ తొండంగి ప్రాంతంలో కొత్త యూనిట్ ను ప్రారంభించేందుకు ప్రయత్నిస్తోంది. టీడీపీ హయాంలోనే ప్రభుత్వం దీనికి పచ్చజెండా ఊపింది. అదే సమయంలో ప్రతిపక్షంలో ఉన్న వైసీపీ ఈ ప్రాజెక్టును తీవ్రంగా వ్యతిరేకించింది. తొండంగి ప్రాంతం తూర్పుగోదావరి జిల్లాలో తీరానికి సమీపంగా ఉంటుంది. ఇక్కడ ఫార్మా కంపెనీ ఏర్పాటు చేయడం వల్ల సముద్ర జలాలు కలుషితమై మత్స్య సంపదకు తీవ్ర నష్టంవాటిల్లే ప్రమాదముందని.. అలాగే భూగర్భ జలాలు కలుషితమైన వ్యవసాయం, జనజీవనానికి ఇబ్బందులెదురవుతాయని స్థానికులు అంటున్నారు. దివీస్ ల్యాబ్ ఇక్కడ వద్దంటే వద్దని ఉద్యమాలు చేస్తున్నారు.

  ఇటీవల దివీస్ కు వ్యతిరేకంగా స్థానికుల ఉద్యమం తీవ్రతరం కావడంతో ప్రభుత్వం రంగంలోకి దిగింది. పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి దివీస్ ప్రతినిథులతో భేటీ అయి సమస్య పరిష్కారంపై చర్చించారు. దివీస్ పరిశ్రమపై ప్రజల్లో నెలకొన్న అభ్యంతరాలు, సందేహాల నివృత్తి జరిగే వరకు ఒక్క ఇటుక కూడా కదపకూడదని సమావేశం సందర్బంగా గౌతమ్ రెడ్డి స్పష్టం చేశారు. అన్ని సమస్యలు పరిష్కరించాకే దివీస్ విషయంలో ముందుకెళ్తామన్నారు. సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు దివీస్ పరిశ్రమ యాజమాన్యం ముందు కొన్ని ప్రతిపాదనలు ఉంచారు.

  Pawan Kalyan, Janasena, Divi’s Lab, East Godawari, Andhra Pradesh, పవన్ కల్యాణ్, జనసేన, దివీస్ ల్యాబ్, తూర్పుగోదావరి, తుని నియోజకవర్గం
  దివీస్ ల్యాబరేటరీస్ (ఫైల్ ఫోటో)


  ఇవీ ప్రభుత్వ ప్రతిపాదనలుఇవీ ప్రభుత్వ ప్రతిపాదనలు

  • దివీస్ పరిశ్రమకు వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేసిన వారిపై తక్షణమే మోపిన కేసులన్నింటినీ ఉపసంహరించుకోవాలి.

  • కాలుష్యం విషయంలో మత్స్యకారుల అభ్యంతరాలను పరిగణలోకి తీసుకుని, వారితో సమావేశమై దివీస్ యాజమాన్యం చర్చలు జరపాలి. మత్స్యకారులకు అవగాహన కలిగించి, వారి స్పష్టమైన అంగీకారం వచ్చేలా సమస్యలను పరిష్కరించాలి.

  • దివీస్ విడుదల చేసే కాలుష్యం వల్ల వాతావరణ సమస్య,  స్థానిక మత్స్యకారుల ఆరోగ్యానికి హాని కలగని పటిష్ట చర్యలకు హామీ ఇవ్వాలి. ప్రత్యేక నిపుణుల పర్యవేక్షణలో జరిగే విధంగా పీసీబీ ఎండీకి ఆదేశాలు

  • దివీస్ పరిశ్రమలో తప్పనిసరిగా స్థానికులకే 75 శాతం ఉద్యోగాలు ఇవ్వాలి• సీఎస్ఆర్ నిధులతో పాటు సమాజహితం కోసం, స్థానిక ప్రజల క్షేమం కోసం చొరవ చూపి ప్రత్యేకంగా చర్యలు తీసుకోవాలి.


  ప్రభుత్వం చర్చించినా దివీస్ ల్యాబ్ కు వ్యతిరేకంగా ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా పవన్ కల్యాణ్ పర్యటనతో దివీస్ ల్యాబ్ వ్యవహారం మరోసారి చర్చనీయాంశమైంది.
  Published by:Purna Chandra
  First published:

  అగ్ర కథనాలు