నేడు అమరావతిలో పవన్ కళ్యాణ్ పర్యటన... 60వ రోజుకు ఆందోళనలు

Amaravati | Pawan Kalyan : త్వరలో అమరావతి రైతులు ఢిల్లీ పెద్దల ముందు పంచాయతీ పెట్టాలనుకుంటున్న సమయంలో... రాజధాని అమరావతిలో పవన్ కళ్యాణ్ పర్యటించనుండటం ఆసక్తి రేపుతోంది.

news18-telugu
Updated: February 15, 2020, 5:37 AM IST
నేడు అమరావతిలో పవన్ కళ్యాణ్ పర్యటన... 60వ రోజుకు ఆందోళనలు
నేడు అమరావతిలో పవన్ కళ్యాణ్ పర్యటన... 60వ రోజుకు ఆందోళనలు
  • Share this:
Amaravati | Pawan Kalyan : ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ నేడు పర్యటించబోతున్నారు. అమరావతిలోని గ్రామాల్లోకి వెళ్లనున్న పవన్ కళ్యాణ్... విశాఖపట్నానికి రాజధానిని తరలించవద్దంటూ 59 రోజులుగా దీక్షలు చేస్తున్న రైతుల్ని కలవనున్నారు. వాళ్లకు మద్దతు పలకనున్నారు. సంఘీభావం తెలపనున్నారు. ఇప్పటికే కర్నూలులో రెండ్రోజులు పర్యటించి సుగాలి ప్రీతి అత్యాచారం, హత్య ఘటనపై సీబీఐతో దర్యాప్తు జరిపించాలని డిమాండ్ చేసిన పవన్ కళ్యాణ్... ఇప్పుడు రెండు రోజుల పాటూ రాజధానిలో పర్యటించాలని నిర్ణయించుకోవడం ఏపీ రాజకీయాల్లో ఆసక్తి రేపుతోంది. పర్యటన షెడ్యూల్ ప్రకారం పవన్... మంగళగిరిలోని జనసేన పార్టీ ఆఫీస్ నుంచి బయలుదేరతారు. వెలగపూడి, మందడం, ఎర్రబాలెం, పెనుమక, రాయపూడి, తుళ్లూరు, అనంతవరం వెంకటేశ్వరస్వామి ఆలయం వరకు వెళ్తారు. మరోవైపు అమరావతి రైతుల ఆందోళనలు ఇవాళ 60వ రోజుకు చేరుకున్నాయి. అమరావతి రైతులు, మహిళలు, ఉద్యోగులు, స్థానికులు అందరూ ఈ ఆందోళనలు కొనసాగిస్తున్నారు.

ఓవైపు రాజకీయాల్లో బిజీగా ఉంటూనే... మరోవైపు సినిమాల్లోనూ బిజీగా ఉన్నారు పవన్ కళ్యాణ్. పార్టీ ఫండ్ కోసం సినిమాలు చేస్తున్న ఆయన... ఒకేసారి మూడు సినిమాలు ఒప్పుకున్నారు. అవి చేస్తూనే ఇటు రాజకీయాల్లో ఆందోళనలు చేస్తున్నారు. ఆదివారం కూడా అమరావతి గ్రామాల్లో పర్యటించి... రేపల్లె, తాడేపల్లి గూడెం జనసేన సైనికులతో సమావేశాలు ఏర్పాటు చేసి... ఆ తరువాత జనసేన పార్టీ న్యాయ విభాగానికి చెందిన సమావేశంలో పవన్ కళ్యాణ్ పాల్గొంటారని తెలిసింది.

సోమవారం హైదరాబాద్ వెళ్లనున్న పవన్ కళ్యాణ్... పింక్ సినిమా షూటింగ్‌లో పాల్గొంటారని సమాచారం. ఈ సినిమాలో పవన్ పార్ట్ 20 నుంచీ 30 రోజుల్లోనే పూర్తి అయ్యేలా షెడ్యూల్ రెడీ చేసుకున్నారు. ఇదివరకు ఎప్పుడూ ఇంత వేగంగా షూటింగ్స్ చెయ్యని పవన్ కళ్యాణ్... మళ్లీ అసెంబ్లీ ఎన్నికలు వచ్చే లోపు వీలైనన్ని ఎక్కువ సినిమాలు చేసి... భారీగా డబ్బు సంపాదించి... ప్రజల్లోకి వెళ్లాలనుకుంటున్నట్లు తెలిసింది. అందులో భాగంగా... వేణు శ్రీరామ్ దర్శకత్వం చేస్తున్న పింక్ సినిమా తర్వాత క్రిష్ జాగర్లమూడి సినిమా షూటింగ్‌లో పాల్గోనున్నారు. ఇప్పటికే ఈ సినిమా కూడా ప్రారంభమైంది. దీని తరువాత మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్‌లో హరీష్ శంకర్ సినిమా కూడా తెరకెక్కనుంది. ఇలా పవన్ స్పీడ్ పెంచడంపై ఆయన అభిమానులు, జనసేన కార్యకర్తలు హ్యాపీగా ఫీలవుతున్నారు. రాజకీయాలతోపాటూ... ఎప్పటికీ సినిమాలు చేస్తూనే ఉండాలని కోరుతున్నారు.

First published: February 15, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు