బీజేపీలో జనసేన విలీనం..? పవన్ కల్యాణ్ ప్లాన్ ఏంటి ?

2014 ఎన్నికలలో బీజేపీ, టీడీపీ పొత్తు పెట్టుకొని ఎన్నికల్లో పోటీ చేశాయి. ఆ ఎన్నికల్లో వీరికి మద్దతుగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రచారం చేశారు

news18-telugu
Updated: August 2, 2019, 8:34 AM IST
బీజేపీలో జనసేన విలీనం..? పవన్ కల్యాణ్ ప్లాన్ ఏంటి ?
జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ (ఫైల్ ఫోటో)
  • Share this:
బీజేపీతో జనసేన జతకడుతుందా ? పవన్ కల్యాణ్ కమలం చెంతకు చేరుతున్నారా ? జనసేనలో ఏం జరుగుతోంది? పవన్ మనసులో ఏం మెదులుతుంది? ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో ఈ అంశం హాట్ టాపిక్‌గా మారింది. బీజేపీతో కలిసే వెళ్తే తప్ప పార్టీని బతికించుకోలేమని నిర్ణయానికి వచ్చిన పవన్ కల్యాణ్ ఆ దిశగా అడుగులు వేస్తున్నట్లు సమాచారం. ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఓటమి, పార్టీ భవిష్యత్తు కార్యాచరణపై గత రెండురోజులుగా పార్టీ నేతలతో సమీక్ష నిర్వహిస్తున్న పవన్ బీజేపీతో కలిసి వెళ్లడంపై చర్చించినట్లు తెలుస్తోంది. కీలక నేతల వదద ఆయనీ విషయాన్ని ప్రస్తావించినట్టు సమాచారం. రాష్ట్రంలో జగన్ మోహన్ రెడ్డిని ఢీకొట్టేందుకు బీజేపీతో చేతులు కలవడం తప్ప మరో మార్గం లేదని జనసేన నేతలు కూడా భావిస్తున్నట్లు తెలుస్తోంది.

జనసేన పార్టీని బీజేపీలో విలీనం చేయాలని తానా సభల్లో పవన్‌ కల్యాణ్‌తో సమావేశమైన బీజేపీ అగ్రనేత రాం మాధవ్ కోరినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో పార్టీని బీజేపీలో విలీనం చేయడం కంటే...ఆ పార్టీతో కలిసి పనిచేయడమే బాగుంటుందని కొందరు నేతలు పవన్‌కు సలహా ఇచ్చినట్లు తెలుస్తోంది. మరోవైపు ఎన్నికల్లో ఘోర ఓటమి పాలైన జనసేనకు బీజేపీ అంత ప్రాధాన్యం కూడా ఇవ్వకపోవచ్చని కొందరు నేతలు అంటున్నారు. కాబట్టి ఆ పార్టీతో సఖ్యతగా ఉంటేనే మేలని మరికొందరు పవన్ కల్యాణ్‌కు చెబుతున్నారు. 2014 ఎన్నికలలో బీజేపీ, టీడీపీ పొత్తు పెట్టుకొని ఎన్నికల్లో పోటీ చేశాయి. ఆ ఎన్నికల్లో వీరికి మద్దతుగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రచారం చేశారు. మొత్తం మీద మరి పవన్ ఈ సమయంలో పార్టీ విలీనంపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాల్సిందే.


First published: August 2, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading