• HOME
  • »
  • NEWS
  • »
  • POLITICS
  • »
  • JANASENA CHIEF PAWAN KALYAN TO MEET WITH KAPU SNAKSHEMA SENA HEADED BY EX MINISTER HARIRAMA JOGAIAH PRN

Pawan Kalyan: పవన్ కల్యాణ్ కాపులపై దృష్టి పెట్టారా..? జనసేనాని యాక్షన్ ప్లాన్ అదేనా..?

Pawan Kalyan: పవన్ కల్యాణ్ కాపులపై దృష్టి పెట్టారా..?  జనసేనాని యాక్షన్ ప్లాన్ అదేనా..?

జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్(ఫైల్ పొటో)

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో జనసేన పార్టీ (Janasena party) బలోపేతానికి పార్టీ అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan) వేగంగా పావులు కదుపుతున్నారు. త్వరలోనే కాపు సంక్షేమ సేన (Kapu Sankeshama Sena) తో జనసేనాని భేటీకానున్నారు.

  • Share this:
    ఆంధ్రప్రదేశ్ లో జనసేన పార్టీ బలోపేతానికి పార్టీ అధినేత పవన్ కల్యాణ్ వేగంగా పావులు కదుపుతున్నారు. ఇప్పటికే ప్రజాసమస్యలపై దృష్టి పెట్టి ప్రభుత్వాన్ని నిలదీస్తున్న పవన్.. అదే క్రమంలో రాష్ట్రంలోని అన్ని వర్గాలను కలుపుకుని పోయే ప్రయత్నం చేస్తున్నారు. ఇందులో భాగంగా తన సొంత సామాజికవర్గమైన కాపులపైనా పవన్ దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. త్వరలోనే కాపు సంక్షేమ సేనతో జనసేన అధినేత పవన్ కల్యాణ్ త్వరలోనే సమావేశం కానున్నారు. రాష్ట్రంలో కాపు సామాజిక వర్గం ఎదుర్కొంటున్న సమస్యలపై భేటీలో చర్చించనున్నట్లు ఆయన ప్రకటించారు. కాపు సంక్షేమ సేన వ్యవస్థాపకుడు, మాజీ మంత్రి చేగొండి హరిరామ జోగయ్య విజ్ఞప్తి మేరకు సమావేశమవుతున్నట్లు పవన్ తెలిపారు. ఈ మేరకు పవన్ కల్యాణ్ ఓ ప్రకటన విడుదల చేశారు.

    కాపుల సంక్షేమం, రిజర్వేషన్, కాపు కార్పొరేషన్ నిధులు, ఇతర సమస్యలపై పోరాడటమే కాకుండా రాష్ట్రంలో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ అమలుపైనా చర్చిస్తామని పవన్ కల్యాణ్ తెలిపారు. ఏపీ జనాభాలో మెజారిటీ వాటాగా ఉన్న కాపు సామాజిక వర్గం జనసేనానికి సొంత సామాజిక వర్గం. ఐతే తనకు కుల, మతాలతో సంబంధం లేదని పవన్ ప్రకటించడం, తనకు కులాన్ని ఆపాదించవద్దని ప్రకటించడంతో కాపుల్లో ఓవర్గం ఆయనకు దురమైంది. 2019 ఎన్నికల్లో కూడా కాపులు పవన్ కు అండగా నిలబడలేదు. కాపులు అధికంగా ఉన్న భీమవరం, గాజువాకలో కూడా ఆయన విజయం సాధించలేకపోయారు.

    ఐతే 2019 ఎన్నికలు ముగిసిన కొన్నాళ్లకు మాజీ మంత్రి చేగొండి హరిరామజోగయ్య కాపు సంక్షేమ సేన పేరుతో సంస్థను స్థాపించడం వెనుక పవన్ ఉన్నారన్న ప్రచారం సాగింది. జనసేనలోని ఓ విభాగమే కాపు సంక్షేమ సేనగా వార్తలు వచ్చాయి. ఐతే అప్పట్లో వాటిని జనసేన పార్టీ ఖండించింది. ఇటీవల తెలంగాణలో EWS రిజర్వేషన్లు అమలు చేయాలని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించిన నేపథ్యంలో పవన్ కూడా ఏపీలోనూ కాపులకు EWS కింద రిజర్వేషన్ అమలు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. అదే సమయంలో కాపు సంక్షేమ సేనతో పవన్ భేటీ కానుండటం ప్రాధాన్యత సంతరించుకుంది.

    ఈ సమావేశంలో కాపుల సమస్యలతో పాటు రిజర్వేషన్ అంశాన్ని కూడా చర్చిస్తామని ప్రకటించడం వెనుక ఏదైనా వ్యూహమందా? అనేది చర్చనీయాంశమవుతోంది. ఎన్నికలకు ముందే కాపు రిజర్వేషన్ సాధ్యం కాదని వైఎస్ జగన్ ప్రకటించినందున.., ఆ సామాజిక వర్గానికి EWSలో 5శాతం అమలు చేయాలన్న డిమాండ్ తో ముందుకెళ్తారని వార్తలు వస్తున్నాయి. మరి పవన్ వ్యూహమేంటో తెలియాలంటే మరికొన్నాళ్లు ఆగాల్సిందే..!
    Published by:Purna Chandra
    First published:

    అగ్ర కథనాలు