మళ్లీ ఢిల్లీ వెళ్లనున్న పవన్ కల్యాణ్.. ఈసారి ఎజెండా ఇదే..

న్నికల ప్రచార సమయంలో జనసేన కార్యకర్త యక్కల అర్జున రావు గుండెపోటుతో మృతి చెందడంపై పవన్ కల్యాణ్ సానుభూతి వ్యక్తం చేశారు. ఆయన కుటుంబానికి రూ.లక్ష ఆర్థిక సాయం అందిస్తున్నట్లు ప్రకటించారు.

news18-telugu
Updated: March 16, 2020, 5:43 PM IST
మళ్లీ ఢిల్లీ వెళ్లనున్న పవన్ కల్యాణ్.. ఈసారి ఎజెండా ఇదే..
పవన్ కళ్యాణ్ (Twitter/Pjhoto)
  • Share this:
స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ల సందర్భంగా ఏపీలో నెలకొన్న హింస, దౌర్జన్యాలు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేశాయని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. అభ్యర్థులతో నామినేషన్లు దాఖలు చేయించే సమయంలో దాడులు చేయడం, వాటిని ఎదుర్కొని నామినేషన్ ఇచ్చినా బలవంతంగా ఉపసంహరింప చేయడం దురదృష్టకరమని తెలిపారు. సోమవారం అసెంబ్లీ, పార్లమెంట్ నియోజకవర్గాల ఇంచార్జులు, రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యులు, ప్రధాన కార్యదర్శులు, కార్యదర్శులు, అధికార ప్రతినిధులు, ముఖ్య నేతలతో పవన్ కళ్యాణ్ టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియలో ప్రజాస్వామ్యాన్ని అధికార పార్టీ ఖూనీ చేసిన తీరుపై కేంద్ర హోమ్ శాఖకు, కేంద్ర, రాష్ట్ర ఎన్నికల సంఘాలకు ఫిర్యాదు చేస్తున్నామని ఈ సందర్భంగా చెప్పారు.

స్థానిక ఎన్నికల్లో మనల్ని అడ్డుకొని దౌర్జన్యాలు చేస్తే మౌనంగా ఉంటే సార్వత్రిక ఎన్నికల సమయంలో మరింత పేట్రేగిపోతారు. కాబట్టి ధైర్యంగా నిలబడదాం. మీ పరిధిలో నామినేషన్ వేసేందుకు ఎదురైన ఇబ్బందులను, ఎదుర్కొన్న దాడులను వివరంగా తెలియచేయండి. పలు చోట్ల మన అభ్యర్థులపై దాడికి దిగడం, నామినేషన్ వేశాక బలవంతంగా విత్ డ్రా చేయించడం లాంటివి నా దృష్టికి వచ్చాయి. రాయలసీమలో పి.ఏ.సి. సభ్యులు హరిప్రసాద్, మధుసూదన్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి బొలిశెట్టి సత్యలపై దాడి చేశారు. మన కూటమిలో భాగమైన బి.జె.పి. అభ్యర్థి మనెమ్మపై కత్తితో దాడి చేస్తే చేతికి బలమైన గాయమైంది. మన అభ్యర్థులు, నాయకులపై దాడులు చేస్తుంటే రక్షించాల్సిన పోలీసులు, నామినేషన్ దశలో ఇబ్బందులు పాల్జేసి అడ్డుకొన్న అధికారుల వివరాలు కూడా సమగ్రంగా తెలియచేయండి. స్థానిక ఎన్నికల్లో చోటు చేసుకున్న హింస, దౌర్జన్యాలు సంఘటనల వారీగా, మీపై దాడులు చేసి ఇబ్బందిపెడుతున్నా రక్షించని అధికారులు, నామినేషన్ దశలో ఆర్.ఓ.ల వ్యవహార శైలిపై వివరాలు పార్టీ కేంద్ర కార్యాలయానికి సత్వరమే పంపించండి. వీటిని క్రోడీకరించి స్వయంగా కేంద్ర హోమ్ శాఖకు అందచేస్తాను. అలాగే కేంద్ర ఎన్నికల సంఘం, రాష్ట్ర ఎన్నికల సంఘం దృష్టికి తీసుకు వెళ్తా.
పవన్ కల్యాణ్


ఐతే ఆయన ఢిల్లీకి ఎప్పుడు వెళ్తారు.? ఎప్పుడు కేంద్ర హోంశాఖకు ఫిర్యాదు చేస్తారన్న వివరాలను మాత్రం వెల్లడించలేదు. ఇక ఎన్నికల ప్రచార సమయంలో జనసేన కార్యకర్త యక్కల అర్జున రావు గుండెపోటుతో మృతి చెందడంపై పవన్ కల్యాణ్ సానుభూతి వ్యక్తం చేశారు. ఆయన కుటుంబానికి రూ.లక్ష ఆర్థిక సాయం అందిస్తున్నట్లు ప్రకటించారు. తూర్పుగోదావరి జిల్లా రామచంద్రపురం మండలంలో జనసేన జెడ్పీటీసీ, ఎంపీటీసీ అభ్యర్థుల తరఫున ప్రచారంలో ఉండగా అర్జున రావు చనిపోయారు. అటు ఎంపీటీసీ స్థానాలలో జనసేన పక్షాన నిలిచి ఏకగ్రీవంగా ఎన్నికైన వారిని పవన్ కల్యాణ్ గారు అభినందించారు.
Published by: Shiva Kumar Addula
First published: March 16, 2020, 5:53 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading