జగన్‌పై పవన్ కళ్యాణ్ ఎటాక్.. నవంబర్ 3న... మధ్యాహ్నం 3 గంటలకు..

ఏపీలో 2.5 లక్షల మంది ఔట్ సోర్సింగ్, కాంట్రాక్ట్ ఉద్యోగులను తొలగించేందుకు జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం నిర్ణయించిందని పవన్ కళ్యాణ్ అన్నారు.

news18-telugu
Updated: October 20, 2019, 6:00 PM IST
జగన్‌పై పవన్ కళ్యాణ్ ఎటాక్.. నవంబర్ 3న... మధ్యాహ్నం 3 గంటలకు..
పవన్ కల్యాణ్ (Source: Twitter)
  • Share this:
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై ప్రత్యక్ష పోరాటానికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సిద్ధమయ్యారు. నవంబర్ 3 న విశాఖలో మధ్యాహ్నం 3 గంటలకు ర్యాలీ చేపట్టాలని జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ నిర్ణయించింది. రాష్ట్రంలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీసుకున్న అనాలోచిత నిర్ణయం వల్ల ఇసుక కొరత ఏర్పడి ఏపీలో సుమారు నాలుగు నెలలుగా భవన నిర్మాణ కార్మికులకు ఉపాది కొరవడింది. దీనిపై పోరాటం చేయాలని, భవన నిర్మాణ కార్మికులకు అండగా ఉండాలని పవన్ కళ్యాణ్ నిర్ణయించారు. కార్మికులకు మద్దతుగా విశాఖలో భారీ ర్యాలీ నిర్వహించనున్నారు. ర్యాలీ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు అనేది స్థానిక నాయకులతో చర్చించి ఖరారు చేయనున్నారు.

తెలంగాణలో సమ్మెచేస్తున్న 48వేల మందిని తీసేశామంటూ కేసీఆర్ ప్రభుత్వం తీసుకున్న అప్రజాస్వామిక నిర్ణయం కంటే కూడా.. ఏపీలో 2.5 లక్షల మంది ఔట్ సోర్సింగ్, కాంట్రాక్ట్ ఉద్యోగులను తొలగించేందుకు జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం నిర్ణయించిందని పవన్ కళ్యాణ్ అన్నారు. తమను రెగ్యులరైజ్ చేయాలని వారంతా కోరుతున్న సమయంలో ప్రభుత్వం ఇలాంటి నిర్ణయం తీసుకోవడం సరికాదన్నారు. సీపీఎస్ విధానం రద్దు చేస్తామన్న ఎన్నికల హామీని వైసీపీ ప్రభుత్వం విస్మరించిందని జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ అభిప్రాయపడింది. ఏపీలో జగన్ ప్రభుత్వం తీసుకొచ్చిన మద్యంపాలసీ కూడా తాగుడును ప్రోత్సహించేలా ఉందన్నారు.

ప్రధాని మోదీతో బాలీవుడ్ ప్రముఖుల సమావేశం
Published by: Ashok Kumar Bonepalli
First published: October 20, 2019, 5:43 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading