చంద్రబాబు దీక్షకు పవన్ కల్యాణ్ మద్దతు
ఇసుక కొరతకి సంబందించి ఎవరు నిరసన తెలిపిన మద్దతిస్తామని పవన్ చెప్పారన్నారు.
advertorial
Updated: November 13, 2019, 12:50 PM IST

పవన్ కల్యాణ్‌తో భేటీ అయిన టీడీపీ సీనియర్ నేతలు
- Advertorial
- Last Updated: November 13, 2019, 12:50 PM IST
జనసేన అధినేత పవన్ కల్యాణ్‌తో టీడీపీ నేతలు భేటీ అయ్యారు. కాసేపటి క్రితమే పవన్ కల్యాణ్‌ను ఆయన నివాసంలో టీడీపీ సీనియర్ నేతలు అచ్చెన్నాయుడు, వర్ల రామయ్య సమావేశమయ్యారు. రేపు ఇసుక కొరతపై విజయవాడలో ధర్నా చౌక్ వద్ద చంద్రబాబు చేస్తున్న ఇసుక దీక్షకు మద్దతివ్వాలని కోరారు. దీనిపై పవన్ కల్యాణ్ సానుకూలంగా స్పందించారు. తమ పార్టీ తరపున మద్దతిస్తామని పేర్కొన్నారు. ఈ భేటీ అనంతరం మాజీ మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ టీడీపీ చేపట్టిన ఇసుక దీక్షకు మద్దత్తు ఇవ్వాలని పవన్‌ను కోరామన్నారు. ఇసుక కొరతకి సంబందించి ఎవరు నిరసన తెలిపిన మద్దతిస్తామని పవన్ తెలిపారన్నారు. ప్రభుత్వ తప్పుల్ని గుర్తు చేస్తే వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారన్నారు. నిన్న పవన్ ప్రెస్ మీట్ పెడితే వెంటనే ఒక మంత్రి ఒంటికాలు మీద వచ్చాడంటూ మండిపడ్డారు.
మాకు నోరు ఉంది మేము మాట్లాడగలము.కానీ సమస్య పరిష్కారం కావటం మాకు ముఖ్యమన్నారు అచ్చెంనాయుడు పవన్ తో సుదీర్ఘ చర్చ జరిపామన... పార్టీ తరపున మద్దతిస్తామని పవన్ తెలిపారని అచ్చెంనాయుడు చెప్పుకొచ్చారు. అన్ని పార్టీలు చంద్రబాబు దీక్షకు మద్దతిచ్చాయని... రేపు ఎవరెవరు దీక్షలో పాల్గొంటారో చూడాలన్నారు అచ్చెంనాయుడు.
మాకు నోరు ఉంది మేము మాట్లాడగలము.కానీ సమస్య పరిష్కారం కావటం మాకు ముఖ్యమన్నారు అచ్చెంనాయుడు పవన్ తో సుదీర్ఘ చర్చ జరిపామన... పార్టీ తరపున మద్దతిస్తామని పవన్ తెలిపారని అచ్చెంనాయుడు చెప్పుకొచ్చారు. అన్ని పార్టీలు చంద్రబాబు దీక్షకు మద్దతిచ్చాయని... రేపు ఎవరెవరు దీక్షలో పాల్గొంటారో చూడాలన్నారు అచ్చెంనాయుడు.
ఇసుక కొరతపై తెలుగుదేశం అధ్యక్షుడు శ్రీ చంద్రబాబు నాయుడు రేపు చేపట్టనున్న దీక్షకు జనసేన మద్దతు కోరుతూ శ్రీ పవన్ కళ్యాణ్ గారిని ఆయన స్వగృహంలో కలిసిన టీడీపీ నేతలు శ్రీ అచ్చెన్నాయుడు, శ్రీ వర్ల రామయ్య. pic.twitter.com/0vUXVaCiLi
— JanaSena Party (@JanaSenaParty) November 13, 2019
ఏపీ అసెంబ్లీలో వైసీపీ ప్రభుత్వంపై టీడీపీ సంధించే అస్త్రాలివే...
సర్కారీ సొమ్ము వాపస్... జగన్ మరో సంచలన నిర్ణయం...
రేపటి నుంచే ఏపీ అసెంబ్లీ సమావేశాలు.. చర్చకు వచ్చే అంశాలివే..
ఫ్యామిలీ మొత్తం పెట్రోల్ పోసుకుంటాం.. వైసీపీ మహిళా ఎమ్మెల్యేకి బాధితుడి హెచ్చరిక...
రేషన్ కార్డులపై మత ప్రచారం... ఏపీలో మరో దుమారం...
బీజేపీకి షాక్... వైసీపీలోకి మాజీ ఎంపీ కుటుంబం...
Loading...