• HOME
  • »
  • NEWS
  • »
  • POLITICS
  • »
  • JANASENA CHIEF PAWAN KALYAN STRONG WARNING TO YSRCP MLA ANNA RAMBABU SU

Pawan Kalyan: అన్నా రాంబాబుకు పవన్ కల్యాణ్ వార్నింగ్.. అద:పాతాళానికి తొక్కేస్తామని హెచ్చరిక

Pawan Kalyan: అన్నా రాంబాబుకు పవన్ కల్యాణ్ వార్నింగ్.. అద:పాతాళానికి తొక్కేస్తామని హెచ్చరిక

ఒంగోలులో మాట్లాడుతున్న పవన్ కల్యాణ్

వైసీపీ ఎమ్మెల్యే అన్నా రాంబాబుపై జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. రాంబాబు బెదిరింపుల వల్లే జనసేన కార్యకర్త వెంగయ్య నాయుడు ఆత్మహత్య చేసుకున్నాడని ఆరోపించారు

  • Share this:
    వైసీపీ ఎమ్మెల్యే అన్నా రాంబాబుపై జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. రాంబాబు బెదిరింపుల వల్లే జనసేన కార్యకర్త వెంగయ్య నాయుడు ఆత్మహత్య చేసుకున్నాడని ఆరోపించారు. ప్రకాశం జిల్లాలో ఆత్మహత్యకు పాల్పడిన జనసేన కార్యకర్త వెంగయ్య కుటుంబాన్ని పవన్ కల్యాణ్ శనివారం పరామర్శించారు. వెంగయ్య కుటుంబానికి అండగా ఉంటామని పవన్ భరోసా ఇచ్చారు. వెంగయ్య కుటుంబ సభ్యులకు రూ. 8.5 లక్షల ఆర్ధిక సాయం అందజేశారు. వెంగయ్య పిల్లల చదువు బాధ్యతలను కూడా తీసుకుంటున్నట్టుగా తెలిపారు. ఈ సందర్భంగా ఒంగోలులో ఏర్పాటు చేసిన సభలో పవన్ ప్రసంగించారు. . ఊరికి రోడ్డు అడిగినందకు వెంగయ్యను బలి తీసుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జనసేన కార్యకర్తలపై పదే పదే దాడులు చేస్తే ఎలా ఎదుర్కొవాలో తెలుసని పవన్ హెచ్చరించారు. ఎన్ని కోట్లు ఖర్చు చేసిన వచ్చే ఎన్నికల్లో అన్నా రాంబాబు అసెంబ్లీలో అడుగుపెట్టకుండా చూసే బాధ్యత తాము తీసుకుంటామని వ్యాఖ్యానించారు.

    అన్నా రాంబాబు గుర్తుంచుకో నిన్ను అద:పాతాళానికి తొక్కేస్తామని హెచ్చరించారు. "జగన్ రెడ్డి గారు మీ ఎమ్మెల్యే చేసిన పనికి శిక్షిస్తారా?.. మీకు ఆ ధైర్యం ఉందా?" అంటూ ప్రశ్నించారు. వెంగయ్య మృతి వైసీపీ పతనానికి నాంది అంటూ వ్యాఖ్యానించారు. జనసేన అధికారంలోకి వచ్చిన తర్వాత బాధ్యులపై చర్యలు తీసుకుంటామని ప్రకటించారు. పోలీస్ వ్యవస్థను కూడా నిర్వీర్యం చేస్తున్నారని మండిపడ్డారు. ఇక, పార్టీ శ్రేణులతో సమావేశం అనంతరం పవన్ కల్యాణ్ ప్రకాశం జిల్లా ఎస్పీని కలిసి వెంగయ్య ఆత్మహత్యకు కారకులైన వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు.

    ఇక, ప్రకాశం జిల్లాలోని బేస్తవారపేట మండలంలోని సింగరపల్లి గ్రామానికి చెందిన బండ్ల వెంగయ్య ప్రైవేటు బస్సు డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. కొద్ది రోజుల క్రితం మరికొందరు జనసేన కార్యకర్తలతో కలిసి వైసీపీ ఎమ్మెల్యే అన్నా రాంబాబు కారును వెంగయ్య అడ్డగించారు. గ్రామంలో పారిశుద్ధ్యం, రోడ్ల సమస్యలను పరిష్కరించాలని కోరారు. అయితే తన కారును అడ్డగించిన వారిపై ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనతో వెంగయ్య మనస్తాపం చెంది పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడని జనసేన నేతలుఆరోపిస్తున్నారు.
    Published by:Sumanth Kanukula
    First published:

    అగ్ర కథనాలు