టాలీవుడ్ కమెడియన్, నిర్మాత బండ్ల గణేష్ మరోసారి వార్తల్లో నిలిచారు. ఈసారి ఏపీ రాజకీయాలపై స్పందించారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ను ఉద్దేశించి ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. పాపాలు పోవాలంటే.. పవన్ అన్న రావాలి అని ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఈ వ్యవహారం ఇటు టాలీవుడ్, అటు రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. పాపాలు చేశారని.. ఎవరిని ఉద్దేశించి ఆయన ట్వీట్ చేసి ఉంటారని చర్చ జరుగుతోంది. ఐతే వైసీపీ అభిమానులు, కార్యకర్తలు మాత్రం బండ్ల గణేష్‌ను టార్గెట్ చేశారు. భజన మరీ ఎక్కువైందని.. విమర్శలు గుప్పిస్తున్నారు.
కాగా, 2018 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బండ్ల గణేష్ పేరు మార్మోగిపోయిన విషయం తెలిసిందే. అప్పుడు కాంగ్రెస్‌లో ఉన్న ఆయన.. తమ పార్టీ గెలవకుంటే గొంతుకోసుకుంటానని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ తర్వాత టీఆర్ఎస్ పార్టీ భారీ మెజారిటీతో విజయం సాధించడంతో.. ఆయనపై బీభత్సమైన ట్రోల్ జరిగింది.
అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమి, ట్రోలింగ్ తర్వాత... తాను ఏ పార్టీలో లేనని బండ్ల గణేష్ పదే పదే చెప్పారు. ఇకపై సినిమాలు, వ్యాపారాలే చూసుకుంటానని క్లారిటీ ఇచ్చారు. కాగా, గతంలో ఎన్నో సినిమాల్లో కమెడియన్‌గా నటించిన ఆయన.. పలు హిట్ చిత్రాలకు నిర్మాతగానూ వ్యవహరించాడు. చాలా ఏళ్ల గ్యాప్ తర్వాత సరిలేరు నీకెవ్వరు సినిమా ద్వారా నటుడిగా రీ ఎంట్రీ ఇచ్చారు. రానున్న రోజుల్లో మళ్లీ సినిమాలు నిర్మించేందుకు సిద్ధమవున్నారు