నల్లమలపై ఆగని జనసేన అధినేత పవన్ కల్యాణ్ పోరాటం

చెంచు నాయకుడు మాట్లాడిన వీడియోను పోస్టు చేస్తూ... ‘అసలు మనం చెంచు తెగలను తోటి భారతీయులుగా గుర్తిస్తున్నామా? అని జనసేనాని పవన్ కల్యాణ్ ట్విట్టర్ వేదికగా ప్రశ్నించారు.

news18-telugu
Updated: September 17, 2019, 11:12 AM IST
నల్లమలపై ఆగని జనసేన అధినేత పవన్ కల్యాణ్ పోరాటం
పవన్ కల్యాణ్
news18-telugu
Updated: September 17, 2019, 11:12 AM IST
నల్లమల చెంచులపై  జనసేన అధినేత పవన్ కల్యాణ్ వీడియో  రిలీజ్ చేశారు. సోమవారం నల్లమల యురేనియం తవ్వకాలపై అఖిలపక్ష నేతలతో పవన్ కల్యాణ్ రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానకి చెంచు నాయకుడు మల్లికార్జున్ కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడిన మల్లికార్జున్ అడవితల్లిని మా గుండెలో పెట్టుకొని చూసుకుంటామన్నారు. ఎవరు అడవిలోకి ప్రవేశించాలని తమ అనుమతి తప్పనిసరిగా తీసుకోవాల్సి ఉంటుందన్నారు. కానీ ఇవాళ అడవుల్లో మాకు జీవించే హక్కు కూడా లేకుండా పోతుందన్నారు. అడవి మాకు గుండెకాయ లాంటిది. మా గుండెకాయ తీయకండి అంటూ ఆయన ఆవేదన వ్యక్తంచేశారు. మా తీర్మానాలు కూడా పాటించండి.అక్కడున్న చెట్లు, జంతువులు మా దేవతలు. మేం ప్రతీ చెట్టు, జంతవులో కూడా దేవతల్ని కొలుస్తామన్నారు.

చెంచు నాయకుడు మాట్లాడిన వీడియోను పోస్టు చేస్తూ... ‘అసలు మనం చెంచు తెగలను తోటి భారతీయులుగా గుర్తిస్తున్నామా? అని జనసేనాని పవన్ కల్యాణ్ ట్విట్టర్ వేదికగా ప్రశ్నించారు. భారత రాజ్యాంగ అసెంబ్లీలో గతంలో జరిగిన చర్చలో ‘గిరిజనులకు ప్రజాస్వామ్యాన్ని నేర్పించాల్సిన అవసరం లేదు. వాళ్ల నుంచి మనం ప్రజాస్వామ్య విలువలను నేర్చుకోవాలి. ఈ భూమి మీద అత్యంత ప్రజాస్వామ్యయుతమైన వ్యక్తులు వారే’ అని చెప్పిన విషయాన్ని పవన్ ప్రస్తావించారు.

అంతేకాకుండా యురేనియం తవ్వకాలతో జరిగి అనర్థాలపై రచించిన అణుధార్మి సత్యలు అనే పుస్తకాన్ని కూడా అఖిలపక్షం సమావేశంలో విడుదల చేశారు. యురేనియం తవ్వకాల వల్లే జరిగే నష్టాలు ఏంటో తెలుసుకోవాలంటే ఈ పుస్తకం తప్పకుండా చదవాలని కోరారు పవన్.


Loading...First published: September 17, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...