Home /News /politics /

JANASENA CHIEF PAWAN KALYAN SERIOUS ON ANDHRA PRADESH GOVERNMENT AND POLICE FOR CREATING HURDLES FOR PROTEST IN RAJAHMUNDRY FULL DETAILS HERE PRN

Pawan Kalyan: పవన్ రాజమండ్రి టూర్ లో టెన్షన్.. టెన్షన్.. పోలీసులపై జనసేనాని ఫైర్..

పవన్ కల్యాణ్ (ఫైల్)

పవన్ కల్యాణ్ (ఫైల్)

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో మరోసారి రాజకీయం (AP Politics) వేడెక్కింది. రాష్ట్రంలో రోడ్ల దుస్థితికి నిరసనగా జనసేన పార్టీ (Janasena Party) చేపట్టిన నిరసన రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమవుతోంది.

    ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో మరోసారి రాజకీయం (AP Politics) వేడెక్కింది. రాష్ట్రంలో రోడ్ల దుస్థితికి నిరసనగా జనసేన పార్టీ (Janasena Party) చేపట్టిన నిరసన రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమవుతోంది. శనివారం శ్రమదానం కార్యక్రమంలో పాల్గొనేందుకు మధురపూడి ఎయిర్ పోర్టు నుంచి రాజమండ్రికి బయలుదేరిన జనసేన అధినేత పవన్ కల్యాణ్ (Janasena Chief Pawan Kalyan) కు స్వాగతం పలికేందురు జనసైనికులు భారీగా అక్కడిగి తరలివచ్చారు. దీంతో పోలీసులకు, జనసైనికులకు తీవ్రవాగ్వాహం జరిగింది. పవన్ కల్యాణ్ వస్తుండగానే క్వారీ సెంటర్ వద్ద కార్యకర్తలను పోలీసులు అడ్డుకోవడంతో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. దీంతో పోలీసులపై పవన్ కల్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తన వాహనం పైకి ఎక్కి వారిపై సీరియస్ అయ్యారు. తప్పుకోవాలంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపు జనసేన నిరసనకు అనుమతి లేదంటూ పలుచోట్ల ఆ పార్టీ నేతలు, కార్యకర్తలను పోలీసులు అడ్డుగున్నారు. దీంతో ప్రభుత్వం భయపడి తమ శ్రమదానంను అడ్డుకుంటున్నారని జనసేన ఆరోపిస్తోంది. రాజమండ్రిలోకి వచ్చే పలు రహదారుల్లో పోలీసులు చెక్ పోస్టులను కూడా ఏర్పాటు చేశారు.

    రాజమండ్రిలోని హుకుంపేట-బాలాజీపేట రోడ్డులో జరిగే శ్రమదానం కార్యక్రమలో పవన్ పాల్గొంటారు. అనంతరం బహిరంగసభలో ప్రసంగిస్తారు. ఈ కార్యక్రమం ముగిసిన తర్వాత పవన్ కల్యాణ్ అనంతపురం జిల్లా వెళ్తారు. మరోవైపు పోలీసులు మాత్రం తాము నిరసన కార్యక్రమాన్ని అడ్డుకోవడం లేదని చెప్తున్నారు. పవన్ కల్యాణ్ భద్రతతే తమకు ముఖ్యమని భారీగా తరలివస్తున్న కార్యకర్తలను అడ్డుకుంటున్నామే తప్ప నిరసనను అడ్డుకోవడం లేదని స్పష్టం చేస్తున్నారు.

    ఇది చదవండి: బద్వేలు బరిలో ప్రధాన పార్టీలు.. బీజేపీ-జనసేనపై అందరి ఫోకస్..! మిత్రుల మధ్య ఏకాభిప్రాయం కుదిరేనా..?


    అక్కడక్కడ మరమ్మతులు
    పవన్ కల్యాణ్ తొలుత ధవళేశ్వరం కాటన్ బ్యారేజీపై శ్రమదానం చేయాలని భావించారు. ఐతే ప్రభుత్వం, ఇంజనీర్లు అనుమతి లేదని తేల్చారు. ఐతే పవన్ నిరసనకు వస్తునారని తెలిసి ప్రభుత్వం రాత్రికి రాత్రే గుంతలు పూడ్చినట్లు జనసైనికులు ఆరోపిస్తున్నారు. కాటన్ బ్యారేజీతో పాటు అనంతపురం జిల్లాలోని కొత్తచెరువు, కర్నూలు, ఒంగోలులోని పలు ప్రాంతాల్లో రాత్రికి రాత్రే రోడ్లు వేయడం పవన్ నిరసన ఎఫెక్టేనని జనసైనికులు చెబుతున్నారు. అంతేకాదు గతంలో పీఎం, సీఎం వచ్చినప్పుడు రోడ్లు బాగుచేసేవారని.. ఇప్పుడు పవన్ వస్తున్నారని తెలిసి రోడ్లు వేస్తున్నారని జనసేన సోషల్ మీడియా విభాగం సెటైర్లు వేస్తోంది. గతంలో ఏపీలోని రోడ్లు బాగుచేయాలంటూ జనసేన పార్టీ సోషల్ మీడియాలో ఉద్యమం నడిపిన సంగతి తెలిసిందే.

    ఇది చదవండి: పవన్-పేర్ని నాని మధ్య ట్వీట్ల వార్.., ఎవరూ తగ్గట్లేదుగా..!


    వైసీపీ కౌంటర్
    ఇదిలా ఉంటే పవన్ కల్యాణ్ శ్రమదానం, నిరసన కార్యక్రమాలపై వైసీపీ స్పందించింది. పవన్ టూర్ ను పట్టించుకోవాల్సిన అవసరం లేదని ప్రభుత్వ ప్రధాన సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. మూడు నాలుగు నెలలు ఒకసారి వచ్చి నిరసన చేపడితే ప్రజలు విశ్వసించరన్నారు. అలాగే పవన్ కార్యక్రమాన్ని అడ్డుకోవాల్సిన అవసరం తమకు లేదన్నారు. మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి కూడా పవన్ పర్యటనపై స్పందించారు. పవన్ కు దమ్ముంటే ఒంటరిగా పోటీ చేసి గెలవాలని సవాల్ విసిరారు.
    Published by:Purna Chandra
    First published:

    Tags: Andhra Pradesh, AP Politics, Janasena party, Pawan kalyan

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు