జగన్ వందరోజుల పాలనపై పవన్ కల్యణ్ సంచలన వ్యాఖ్యలు

ఇసుక మాఫియానే టీడీపీ ప్రభుత్వాన్ని కూల్చివేసిందన్నారు. ఆరోగ్యకరమైన పాలన జరగాలని కోరుకుంటున్నామన్నారు.

news18-telugu
Updated: September 14, 2019, 11:57 AM IST
జగన్ వందరోజుల పాలనపై పవన్ కల్యణ్ సంచలన వ్యాఖ్యలు
పవన్ కళ్యాణ్, వైఎస్ జగన్
news18-telugu
Updated: September 14, 2019, 11:57 AM IST
ఏపీ సీఎం జగన్ వంద రోజుల పాలనపై సంచలన వ్యాఖ్యలు చేశారు జనసేన అధినేత పవన్ కల్యాణ్. జగన్ వంద రోజుల పాలన ప్రణాళిక బద్ధంగా లేదన్నారు. సంవత్సరం వరకు జగన్ పాలనపై మాట్లాడే అవకాశం తనకు రాదనుకున్నానన్నారు. కానీ మూడునెలల్లోపే వైసీపీ పాలనపై మాట్లాడే అవకాశం కల్పించారన్నారు. రెండు వారల్లోనే ప్రభుత్వ నిర్ణయాలు ఆందోళనకరంగా మారాయన్నారు. వైసీపీ సంక్షేమ పథకాలు చూస్తుంటే... పారదర్శకత లోపించిందన్నారు. జనరంజకమైన జనవిరుద్ధ పాలనగా వైసీపీ పాలనను అభవర్ణించవచ్చన్నారు జనసేనాని. నవరత్నాలు జనరంజకమైనవే ఆయన.. వాటిని జనవిరుద్ధంగా అమలు చేస్తున్నారని పవన్ కల్యాణ్ ఆరోపించారు.

ఏపీలో కియా పరిశ్రమ స్థాపించిన సీఈఓను స్థానిక వైసీపీ నేతలు అవమానించారన్నారు. ఇలా చేస్తే రాష్ట్రానికి పెట్టుబడులు వస్తాయా ? అంటూ పవన్ ప్రవ్నించారు. విలేజ్ వాలంటీర్లది కొరియర్ సర్వీస్‌లా ఉందన్నారు.వైసీపీ క్యాడర్ కోసమే వాలంటీర్ల వ్యవస్థ అంటూ మండిపడ్డారు పవన్. గ్రామ వాలాంటీర్లతో సమాంతర వ్యవస్థ తయారు చేస్తున్నారన్నారు. వైసీపీ మేనిఫెస్టో అమలుకు 50వేల కోట్లు కావాలన్నారు. కానీ రాష్ట్రానికి రూ. 2.59 లక్షల కోట్ల అప్పు ఉందన్నారు పవన్. పోలవరం నిర్మాణంలో అవకతవకలు ఉంటే సరిచేయాలి కానీ.. టెండర్లను ఎలా రద్దు చేస్తారని ప్రశ్నించారు జనసేనాని. బొత్స తన ఆస్తుల్ని అమ్మి పోలవరాన్ని పూర్తిచేస్తారా అంటూ పవన్ ఫైర్ అయ్యారు. రాష్ట్రంలో ఇసుకే లేకుండా చేశారన్నారు. వందరోజుల్లో ఇసుక పాలసీని తీసుకురాలేకపోయారన్నారు. యోగి ఆదిత్యనాథ్ కూడా సీఎంగా కొత్తగావచ్చినా.. వందరోజుల్లో ఆయన పాలన చేసుకుంటూ పోయారన్నారు. ఇసుక మాఫియానే టీడీపీ ప్రభుత్వాన్ని కూల్చివేసిందన్నారు.

జగన్ వంద రోజుల పాలనపై జనసేన పార్టీ 33 పేజీల నివేదిక తయారు చేసింది. ఇసుక సమస్యలు, ఆర్థిక పరిస్థితి, పెట్టుబడులపై జనసేన అధ్యాయనం చేసింది.ఆరోగ్యకరమైన పాలన జరగాలని కోరుకుంటున్నామన్నారు.

First published: September 14, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...