సీఎం జగన్‌కు పవన్ కళ్యాణ్ వార్నింగ్.. వైసీపీపై సంచలన వ్యాఖ్యలు

జనసేన ఎమ్మెల్యే మీద కేసులు పెట్టడంలో ఉన్న శ్రద్ధ, వేగం ఇతర కేసుల్లో ఎందుకు లేదని పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు. జగన్ మోహన్ రెడ్డి బాబాయి వైఎస్ వివేకానంద హత్య కేసులో ఇంత వేగం ఎందుకు లేదని ప్రశ్నించారు.

news18-telugu
Updated: August 15, 2019, 7:05 PM IST
సీఎం జగన్‌కు పవన్ కళ్యాణ్ వార్నింగ్.. వైసీపీపై సంచలన వ్యాఖ్యలు
జనసేన అధినేత పవన్ కళ్యాణ్
news18-telugu
Updated: August 15, 2019, 7:05 PM IST
ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సంచలన ఆరోపణలు చేశారు. గత ఎన్నికల్లో కేవలం డబ్బు వల్లే వైసీపీ గెలిచిందని వ్యాఖ్యానించారు. భారీ ఎత్తున డబ్బు పంచడం వల్లే ఈరోజు వైసీపీ అధికారంలోకి వచ్చిందన్నారు. ఇటీవల వరుసగా పార్లమెంటరీ నియోజకవర్గాలపై పార్టీ నేతలతో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సమీక్షలు జరుపుతున్నారు. ఈ క్రమంలో ఏలూరు పార్లమెంట్ సమీక్షలో ఈ వ్యాఖ్యలు చేశారు. వైసీపీ ప్రభుత్వం జనసేన మీద కక్షగట్టిందని పవన్ ఆరోపించారు. ఉన్న ఒక్క జనసేన ఎమ్మెల్యేను కూడా లాక్కోవడానికి కుట్ర పన్నిందన్నారు. అందుకే జనసేన ఎమ్మెల్యే రాపాక వర ప్రసాద్ మీద కేసులు పెట్టిందని చెప్పారు. జనసేన ఎమ్మెల్యే మీద కేసులు పెట్టడంలో ఉన్న శ్రద్ధ, వేగం ఇతర కేసుల్లో ఎందుకు లేదని పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు. జగన్ మోహన్ రెడ్డి బాబాయి వైఎస్ వివేకానంద హత్య కేసులో ఇంత వేగం ఎందుకు లేదని ప్రశ్నించారు. దీంతోపాటు మీడియా వారిని దుర్భాషలాడి, దాడి చేసిన నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మీద ఎందుకు కేసులు పెట్టలేదని పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు. తనను రెచ్చగొట్టొదని, ఎంతవరకైనా పోరాడతానని జనసేన చీఫ్ అన్నారు.

First published: August 15, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...