పవన్ కళ్యాణ్ చక్రం తిప్పుతున్నారా... అంతా సీక్రెట్...

అసలు ఉన్నట్టుండి పవన్ కళ్యాణ్ ఢిల్లీ ఎందుకు వెళ్లారు ? అక్కడ ఏం చేశారనే అంశం హాట్ టాపిక్‌గా మారింది.

news18-telugu
Updated: November 18, 2019, 1:38 PM IST
పవన్ కళ్యాణ్ చక్రం తిప్పుతున్నారా... అంతా సీక్రెట్...
పవన్ కళ్యాణ్(ఫైల్ ఫోటో)
  • Share this:
రెండురోజులు పాటు దేశ రాజధాని డిల్లీలో బిజీగా గడిపిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నిన్న సాయంత్రం హైదరాబాద్ తిరిగొచ్చారు. ఢిల్లీ పర్యటనలో ఆయన ఎవరెవరిని కలిశారు ? ఎప్పుడూ లేని విధంగా ఢిల్లీ పర్యటన వివరాలను జనసేన పార్టీ ఎందుకు గోప్యంగా ఉంచింది ? ఢిల్లీ పర్యటనకు ముందే మతపరమైన అంశాలను తెరపైకి తెస్తూ సీఎం జగన్ ను టార్గెట్ చేసిన పవన్.. హస్తినలో అందుకు కొనసాగింపుగా బీజేపీ నేతలను కలిశారా ? ఇప్పుడు రాష్ట్ర రాజకీయ వర్గాల్లో దీనిపై విస్తృత చర్చ సాగుతోంది. అసలు ఉన్నట్టుండి పవన్ కళ్యాణ్ ఢిల్లీ ఎందుకు వెళ్లారు ? అక్కడ ఏం చేశారనే అంశం హాట్ టాపిక్‌గా మారింది.

ఏపీలో 2024 నాటికి బలపడాలన్న లక్ష్యంతో పావులు కదుపుతున్న బీజేపీ అధిష్టానం ఆ మేరకు జనసేన అధినేత పవన్ తో పాటు ఆయన సోదరుడు, మాజీ కేంద్రమంత్రి చిరంజీవిని సైతం సంప్రదించింది. అయితే చిరంజీవి తనకు ఇప్పట్లో రాజకీయాల్లోకి తిరిగి వచ్చే ఉద్దేశం లేదని, సినిమాలతో బిజీగా ఉన్నట్లు స్పష్టం చేశారు. అయినా చిరంజీవి కోసం తీవ్రంగా ప్రయత్నించిన బీజేపీకి చివరికి నిరాశే మిగిలింది. ఈ దశలో ఆయన సోదరుడు గతంలో తమతో కలిసి పనిచేసి ఆ తర్వాత విబేధించిన జనసేనాని పవన్ కళ్యాణ్‌ను సంప్రదించింది.

andhra pradesh,bjp,bjp andhra pradesh,bjp leaders of andhra pradesh,bjp ministers andhra pradesh,bjp try to empty tdp in andhra pradesh,bjp starts operation akarsh in andhra pradesh, tdp in andhra pradesh,try to empty tdp in andhra pradesh,andhra pradesh with operation,operation akarsh in andhra pradesh,narendra modi in andhra pradesh,tdp in andhra pradesh with operation,బీజేపీ,ఆంధ్రప్రదేశ్,ఆపరేషన్ ఆకర్ష్,టీడీపీ, వైసీపీ, జనసేన,కన్నా లక్ష్మీనారాయణ,
అమిత్ షా, నరేంద్ర మోదీ


అమెరికాలో బీజేపీ కీలక నేత రామ్ మాథవ్ తో సమావేశమైన పవన్.. తాజా రాజకీయ పరిణామాలపై చర్చించారు. దీనిపై అప్పట్లో తీవ్ర చర్చ సాగింది. పవన్ తో పొత్తు కోసం బీజేపీ చేస్తున్న ప్రయత్నాల్లో భాగంగా రామ్ మాథవ్ భేటీ జరిగిందనే ప్రచారం సాగింది. అయితే ఆ తర్వాత కొంతకాలంగా మౌనంగా ఉన్న పవన్... తాజాగా వైసీపీ ప్రభుత్వాన్ని, సీఎం జగన్ ను లక్ష్యంగా చేసుకుని వాగ్బాణాలు సంధిస్తున్నారు. ఇందులో ప్రధానంగా మతపరమైన అంశాలను తెరపైకి తెస్తున్నారు.

ఇంగ్లీష్ మాధ్యమం అమలుపై చేస్తున్న విమర్శల్లో భాగంగా తిరుమల వ్యవహారాల్ని అందులో జగన్ ను తెరపైకి తెచ్చేందుకు పవన్ తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. తిరుమలలో సుప్రభాతాన్ని ఇంగ్లీష్ లో పాడించుకోవాలని ప్రభుత్వానికి సూచించిన పవన్, ఆ తర్వాత తిరుమల లడ్డూను జగన్ తింటారా అంటూ ప్రశ్నించారు. సాధారణ పరిస్ధితుల్లో పవన్ ఈ విమర్శలు చేస్తే అందులో ప్రత్యేకత ఏమీ ఉండేది కాదు. కానీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ జగన్‌ను మతపరంగా టార్గెట్ చేస్తున్న సందర్భంలో పవన్ చేసిన విమర్శలు చర్చనీయాంశం అయ్యాయి.

Pawan kalyan, janasena, janasena party, ap news, ap politics, bjp, amit shah, pm modi, tdp, ysrcp, పవన్ కళ్యాణ్, జనసేన, జనసేన పార్టీ, ఏపీ న్యస్, ఏపీ రాజకీయాలు, బీజేపీ, అమిత్ షా, ప్రధాని మోదీ, టీడీపీ, వైసీపీ
పవన్ కళ్యాణ్, నరేంద్రమోదీ(ఫైల్ ఫోటో)


బీజేపీ అజెండాను పవన్ అమలు చేస్తున్నారనే విమర్శలూ వినిపించాయి. ఇప్పుడు వీటికి కొనసాగింపుగా ఢిల్లీలో పవన్ బీజేపీ అధిష్టానం పెద్దలను కలిశారనే ప్రచారం సాగుతోంది. ఈ విషయాల్ని ఇప్పటికిప్పుడే బయటపెట్టడం మంచిది కాదని భావిస్తున్న జనసేన, బీజేపీ వర్గాలు గోప్యంగా ఉంచుతున్నారని తెలుస్తోంది. అందుకే రెండురోజుల పర్యటన వ్యక్తిగతమని చెప్పి వివరాలు చెప్పేందుకు కూడా నిరాకరించారనే వాదన వినిపిస్తోంది. గతంలో ఏపీ అభివృద్ధి కావాలంటే బీజేపీ సహకారం అవసరమని ప్రధాని మోడీతో కలిసి 2014 ఎన్నికల్లో ప్రచారం చేసిన పవన్.. ఆ తర్వాత టీడీపీ ఎన్డీయే నుంచి బయటికి రాగానే ఆ పార్టీ వాదన అందుకుని రాష్ట్రానికి పాచిపోయిన లడ్డూలు ఇచ్చారంటూ బహిరంగ విమర్శలకు దిగారు. కానీ ఎన్నికలకు ముందు నుంచే మాట మార్చి బీజేపీ విషయంలో మెతక వైఖరి అవలంబిస్తున్న పవన్.. మరోసారి పొత్తుకు సిద్ధమవుతున్నారనే సంకేతాలు కనిపిస్తున్నాయి. అయితే బీజేపీతో పొత్తు చర్చలను జనసేన వర్గాలు నేరుగా ధృవీకరించకపోయినా త్వరలో దీనిపై జనసేనాని ఓ స్పష్టత ఇస్తారని మాత్రం చెప్తున్నాయి.

సయ్యద్ అహ్మద్, న్యూస్ 18 ప్రతినిధి, విజయవాడFirst published: November 18, 2019, 1:38 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading