పవన్ కళ్యాణ్‌‌‌కు అనారోగ్యం... మళ్లీ తిరగబెట్టిన సమస్య...

పవన్ కళ్యాణ్ అశ్రద్ధ చేయడంతో మళ్లీ వెన్నునొప్పి బాధించడం మొదలు పెట్టింది. దీంతో గత మూడు రోజులుగా పవన్ కళ్యాణ్ బయట కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు.

news18-telugu
Updated: September 26, 2019, 3:35 PM IST
పవన్ కళ్యాణ్‌‌‌కు అనారోగ్యం... మళ్లీ తిరగబెట్టిన సమస్య...
పవన్ కల్యాణ్
  • Share this:
జనసేన అధినేత పవన్ కళ్యాన్ అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఈ విషయాన్ని జనసేనాని స్వయంగా ధ్రువీకరించారు. గబ్బర్ సింగ్ సినిమా షూటింగ్ సమయంలో వెన్నునొప్పి సమస్య తలెత్తింది. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో అది కొంచెం పెరిగింది. అయితే, పవన్ కళ్యాణ్ అశ్రద్ధ చేయడంతో మళ్లీ వెన్నునొప్పి బాధించడం మొదలు పెట్టింది. దీంతో గత మూడు రోజులుగా పవన్ కళ్యాణ్ బయట కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. విజయవాడలో మీడియా సమావేశం ఏర్పాటు చేసింది. అందులో పాల్గొనాల్సిందిగా జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్‌ను ఆహ్వానించింది. ఆ సమావేశానికి తాను హాజరుకాలేనంటూ పవన్ కళ్యాణ్ చెప్పారు. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశారు. ‘మీడియా స్వేచ్ఛ కోసం మీరు చేస్తున్న పోరాటానికి జనసేన తరఫున, నా తరఫున వ్యక్తిగతంగా సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నా. గబ్బర్ సింగ్ సినిమా షూటింగ్ సమయంలో వెన్నుపూసకు గాయమైంది. అప్పటి నుంచి అది వేధిస్తోంది. ఇటీవల ఎన్నికల ప్రచారంలో అశ్రద్ధ చేయడం వల్ల అది మరింత పెరిగింది. డాక్టర్లు సర్జరీకి వెళ్లమని సలహా ఇచ్చినప్పటికీ సంప్రదాయ వైద్యం మీద నమ్మకంతో ఆ దిశగా ముందుకు వెళ్తున్నా. గత కొన్ని రోజులుగా మళ్లీ బ్యాక్ పెయిన్ తీవ్రంగా ఇబ్బంది పెడుతోంది. ట్రీట్మెంట్ తీసుకుంటున్నాను. ఆ కారణంగానే గత మూడు రోజులుగా ఎటువంటి కార్యక్రమాల్లో పాల్గొనడం లేదు. మీరు నిర్వహించే సమావేశానికి జనసేన తరఫున ప్రతినిధులు మీడియా రౌండ్ టేబుల్ సమావేశానికి హాజరవుతారు.’ అని పవన్ కళ్యాణ్ ఆ ప్రకటనలో చెప్పారు.

First published: September 26, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు