రైతులకు రూ. 5వేల పింఛన్.. ఎకరాకు రూ. 8వేల సాయం.. పవన్ కల్యాణ్ హామీల వర్షం

రాబోయే ఎన్నికల్లో లబ్ది పొందేందుకే రాజకీయ పార్టీలు వ్యూహ ప్రతివ్యూహాలతో ముందుకు సాగుతున్నాయి. ప్రజాకర్షక పథకాలను ప్రకటిస్తున్నాయి. అందులో భాగంగా.. జనసేన అధ్యక్షుడు అధ్యక్షుడు హామీల వర్షం కురిపించారు. అధికారంలోకి వస్తే రైతులను అన్ని విధాలా ఆదుకుంటామని చెప్పారు.

news18-telugu
Updated: March 14, 2019, 7:41 PM IST
రైతులకు రూ. 5వేల పింఛన్.. ఎకరాకు రూ. 8వేల సాయం.. పవన్ కల్యాణ్ హామీల వర్షం
పవన్ కల్యాణ్(File)
  • Share this:
జనసేన పార్టీ ఆవిర్భావసభ రాజమండ్రిలో అట్టహాసంగా జరిగింది. ఈ బహిరంగసభకు రాష్ట్ర నలుమూలల నుంచి తరలివచ్చిన అశేష జనవాహినిని ఉద్దేశించి ప్రసంగించిన జనసేన అధినేత పవన్ కల్యాణ్.. ప్రజలపై హామీల వర్షం కురిపించారు. అధికారంలోకి వస్తే ప్రధానంగా రైతుల కోసం ప్రత్యేకమైన పథకాలను అమలు చేస్తామని ప్రకటించారు. ప్రభుత్వోద్యోగుల మాదిరి.. 60 ఏళ్లు దాటిన చిన్న, సన్నకారు రైతులకు రూ. 5వేల ఫించన్లు ఇస్తామని పవన్ ప్రకటించారు. అంతే కాదు, రైతులందరికీ ఏడాదిలో ఎకరాకు రూ. 8వేల చొప్పున పెట్టుబడి సాయం అందిస్తామని చెప్పారు. సభావేదిక మీదే పార్టీ మేనిఫెస్టో ప్రకటించిన పవన్ కల్యాణ్.. అన్ని వర్గాలనూ అక్కున చేర్చుకుంటామని ప్రకటించారు. రైతులపై హామీల వర్షం కురిపించిన ఆయన.. ఉభయగోదావరి జిల్లాల్లో గ్లోబల్ వ్యవసాయ మార్కెట్‌ను రూ. 5వేల కోట్లతో ఏర్పాటు చేస్తామని చెప్పారు. అంతేకాదు, జనసేన అధికారంలోకి వస్తే కులాల వారీగా ఏర్పాటు చేసిన హాస్టల్స్ ఎత్తేసి.. అందరికీ కలిపి సమీకృత హాస్టల్స్‌ను ఏర్పాటు చేస్తామన్నారు. విద్యార్థులకు ఉచిత బస్‌పాసులను అందజేస్తామని, అందరికీ అన్నం పెట్టిన డొక్కా సీతమ్మ పేరిట క్యాంటిన్లను ఏర్పాటు చేస్తామని చెప్పారు. ప్రతీ కుటుంబానికి రూ. 10 లక్షల ఆరోగ్యభీమా అందిస్తామన్నారు. ఇక మీదట అన్ని నోటిఫికేషన్లకు ఒకేసారి ఫీజులు చెల్లించేలా కొత్త పద్ధతిని తీసుకొస్తామన్నారు.

పవన్ కల్యాణ్ ఆవిష్కరించిన జనసేన మేనిఫెస్టోలో వివిధ వర్గాలకు సంబంధించిన కీలకాంశాలు:

రైతులు..
రైతులకు ఎకరానికి రూ.8000 సాగుసాయం. రూ.10,000 వరకు పెంచే అవకాశం
60 ఏళ్లు దాటిన చిన్న, సన్నకారు రైతులకు నెలకు రూ. 5000 పింఛను
ఉభయ గోదావరి జిల్లాల్లో రూ.5వేల కోట్లతో గ్లోబల్ వ్యవసాయ మార్కెట్
రైతులకు ఉచితంగా సోలార్ పంపు సెట్లువెలిగొండ ప్రాజెక్టును త్వరితగతిన పూర్తి చేయడం

విద్యార్థులు
ఒకటో తరగతి నుంచి పదో తరగతి వరకు ఉచిత విద్య
విద్యార్థులకు డొక్కా సీతమ్మ పేరుతో క్యాంటీన్లు, కాలేజీ ఐడీ కార్డులతో ఉచిత బస్సు ప్రయాణం

యువత
ప్రభుత్వ నోటిఫికేషన్లకు ఏడాదిలో ఒక్కసారే ఫీజులు కట్టాలి. ప్రతి నోటిఫికేషన్ కోసం ఫీజు కట్టాల్సిన పనిలేదు.
బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు అనే తేడా లేకుండా అందరికీ కామన్ హాస్టల్స్
ప్రభుత్వం వచ్చిన ఆరు నెలల్లోనే లక్ష ఉద్యోగాల భర్తీ
ప్రభుత్వ ఉద్యోగుల కోసం సీపీఎస్ విధానం రద్దు
మహిళా ప్రభుత్వ ఉద్యోగుల పిల్లలకోసం ప్రభుత్వ డే కేర్ సెంటర్లు
10 లక్షల ఉద్యోగాల కల్పనకు కృషి

మహిళలు
బంగారం తాకట్టుపై అర్ధరూపాయి వడ్డీ
సంక్రాంతి, క్రిస్‌మస్, ముస్లిం పండుగల సమయంలో మహిళలకు చీరలు
డ్వాక్రా మహిళల కోసం మహిళా బ్యాంకుల ఏర్పాటు

ఇతర హామీలు...
రెల్లి యువతకు రూ.50,000 వరకు వడ్డీ లేని రుణం
ప్రతి జిల్లాకు మూడు అవకాశాల జోన్లు
ముస్లింల అభివృద్ధికోసం సచార్ కమిటీ సిఫారసుల అమలు
మత్స్యకారులకు 300 రోజుల పాటు ఉపాధి కల్పన
మత్స్యకారులు చేపల వేటకు వెళ్లలేని సమయంలో రోజుకు రూ. 500 భత్యం
130 స్మార్ట్ సిటీలు అభివృద్ధి, దీని వల్ల కొత్త ఉద్యోగాల కల్పనకు కృషి.

 
First published: March 14, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading