ఏపీ రాజధాని మార్చితే... పవన్ కల్యాణ్ దీక్ష ?

రాజధాని విషయంలో స్పష్టమైన ప్రకటన లేకపోవటంతో జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ప్రభుత్వం తీరును తప్పు పడుతున్నారని సమాచారం.

news18-telugu
Updated: September 14, 2019, 11:19 AM IST
ఏపీ రాజధాని మార్చితే... పవన్ కల్యాణ్ దీక్ష ?
పవన్ కళ్యాణ్ (ఫైల్ ఫోటో)
news18-telugu
Updated: September 14, 2019, 11:19 AM IST
మంగళగిరిలో పవన్ కల్యాణ్ ప్రెస్ మీట్...

జనసేన అధినేత పవన్ కల్యాణ్ మరోసారి ఏపీ రాజధానిలో పర్యటించనున్నారు. మూడు రోజుల పాటు పవన్ కల్యాణ్ పర్యటన కొనసాగనుంది.ఈ సందర్భంగా పవన్ ... జగన్ వందరోజుల పాలనపై స్పందిస్తారని సమాచారం.రాజధాని విషయంలో స్పష్టమైన ప్రకటన లేకపోవటంతో జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ప్రభుత్వం తీరును తప్పు పడుతున్నాడని సమాచారం. ఏపీలో మంత్రులు రాజధానిపై మాట్లాడుతున్నప్పటికీ... జగన్ మాత్రం రాజధాని విషయంలో ఇప్పటివరకు స్పష్టమైన వైఖరి ఏంటో చెప్పటం లేదు. దీంతో ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతినే కొనసాగిస్తారా లేక మారుస్తారా అనే ప్రశ్నకు ఖచ్చితమైన సమాధానం దొరకట్లేదు.

ఈ నేపథ్యంలో వైసీపీ అధికారంలోకి వచ్చి 100 రోజులు పూర్తి కావటంతో పవన్ ప్రభుత్వంపై విమర్శలు చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈరోజు పవన్ పర్యటనలో వైసీపీ 100 రోజుల పాలనపై పవన్ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తారని సమాచారం. మరోవైపు అమరావతి పర్యటనలో పవన్ కళ్యాణ్ పార్టీ నేతలు మరియు కార్యకర్తలతో సమీక్షలు నిర్వహిస్తాడని తెలుస్తోంది. విజయవాడకు చెందిన వంగవీటి రాధ జనసేన పార్టీలో చేరే అవకాశం ఉందని తెలుస్తోంది. రాజధానిని మారిస్తే పవన్ కళ్యాణ్ రైతుల తరపున దీక్షకు దిగే అవకాశం ఉందని తెలుస్తోంది. మరికాసేపట్లో ఆయన మంగళగిరిలో ప్రెస్ మీట్ నిర్వహించబోతున్నారు. దీంతో పాటు పవన్ కళ్యాణ్ జగన్ 100 రోజుల పాలనపై ఒక నివేదికను సిధ్ధం చేసినట్లు తెలుస్తోంది. ఈ నివేదికను ఈరోజు ప్రజల ముందు ఉంచే అవకాశం ఉందని తెలుస్తోంది.



First published: September 14, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...