గోదావరి పడవ ప్రమాదంపై స్పందించిన పవన్ కల్యాణ్

దేవీపట్నం మండలం కచులూరు వద్ద 60 మందితో కూడిన బోటు మునిగిపోయింది. ప్రస్తుతం 27 మందిని రక్షించినట్లు తెలుస్తోంది.

news18-telugu
Updated: September 15, 2019, 3:49 PM IST
గోదావరి పడవ ప్రమాదంపై స్పందించిన పవన్ కల్యాణ్
పవన్ కల్యాణ్(File)
news18-telugu
Updated: September 15, 2019, 3:49 PM IST
తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం మండలం కచ్చులూరు దగ్గర పర్యాటకులతో ఉన్న పడవ మునిగిన ఘటనపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్పందించారు. పడవ మునిగిపోయిందన్న విషయం తెలిసి బాధ కలిగిందన్నారు. సుమారు 50 మంది గల్లంతయ్యారని తనకు తెలిసిందన్నారు. పర్యాటకుల ఆచూకీ, ఇతర సహాయ చర్యల్లో పాల్గొనేందుకు తక్షణం ఘటన ప్రదేశానికి వెళ్ళాల్సిందిగా జనసేన నాయకులకు, శ్రేణులకు పవన్ విజ్ఞప్తి చేశారు. అవసరమైన సహాయ కార్యక్రమాలు చేపట్టాలని పిలుపునిచ్చారు.

గోదావరి నదిలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. 60మందితో వెళ్తున్న బోటు మునిగింది. దేవీపట్నం మండలం కచులూరు వద్ద 60  మందితో కూడిన బోటు మునిగిపోయింది. ప్రస్తుతం 27 మందిని రక్షించినట్లు తెలుస్తోంది. బోటు పాపికొండలు విహార యాత్రకు వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. బోటులో ఉన్న కొందరు లైఫ్ జాకెట్ల సాయంతో ఒడ్డుకు చేరినట్టు సమాచారం. పోలవరం గండిపోచమ్మ ఆలయం నుంచి బోటు బయలుదేరిన గంట సేపటి తర్వాత ఈ ఘోరం జరిగినట్టు భావిస్తున్నారు. సంఘటన స్థలికి పోలీసులు, అధికారులు తరలి వెళ్లారు.First published: September 15, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...