తెలంగాణలో రైతు మృతిపై స్పందించిన పవన్ కళ్యాణ్

రైతులకు ఎంత మేరకు విత్తనాలు, ఎరువులు అవసరమవుతాయో అంచనా వేసి డిమాండ్ తగ్గ విధంగా సరఫరా చేయడం ప్రభుత్వ బాధ్యత అని పవన్ కళ్యాణ్ తెలిపారు. అందుకు

news18-telugu
Updated: September 6, 2019, 5:02 PM IST
తెలంగాణలో రైతు మృతిపై స్పందించిన పవన్ కళ్యాణ్
జనసేన అధినేత పవన్ కళ్యాణ్
news18-telugu
Updated: September 6, 2019, 5:02 PM IST
తెలంగాణలో యూరియా కోసం క్యూలైన్‌లో నిలబడి రైతు చనిపోవడం బాధాకరమని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. ఈ ఘటనపై పదవిలో ఉన్న వాళ్లు సరైన రీతిలో స్పందించాలని ఆయన కోరారు. ఈ మేరకు జనసేన పార్టీ ప్రకటన విడుదల చేసింది. రైతులకు ఎంత మేరకు విత్తనాలు, ఎరువులు అవసరమవుతాయో అంచనా వేసి డిమాండ్ తగ్గ విధంగా సరఫరా చేయడం ప్రభుత్వ బాధ్యత అని పవన్ కళ్యాణ్ తెలిపారు. అందుకు తగ్గ ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని సూచించారు. ఇందుకోసం యుద్ధప్రాదిపదికన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి సూచించారు. యూరియా కోసం క్యూలైన్‌లో నిలబడి చనిపోయిన రైతు ఎల్లయ్య కుటుంబాన్ని ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకోవాలని పవన్ కళ్యాణ్ కోరారు.


First published: September 6, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...