పోరాటం జరిపి ఉంటే... కోడెల మృతిపై పవన్ కల్యాణ్ స్పందన

కోడెల ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నానన్నారు. ఈ ఆపత్కాల సమయంలో కోడెల కుటుంబసభ్యులకు ఆ దేవుడు ఆత్మస్థైర్యం ఇవ్వాలని కోరుతున్నానన్నారు.

news18-telugu
Updated: September 16, 2019, 2:57 PM IST
పోరాటం జరిపి ఉంటే... కోడెల మృతిపై పవన్ కల్యాణ్ స్పందన
కోడెల మృతిపై స్పందించిన పవన్ కల్యాణ్
news18-telugu
Updated: September 16, 2019, 2:57 PM IST
మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు మరణంపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్పందించారు. రాజకీయంగా ఎదురవుతున్న ఒడిదుడుకులు ఎదురుకోలేక ఆయన తుదిశ్వాస విడవటం తనను తీవ్రంగా కలిచి వేసిందన్నారు. ఆయనపై వచ్చిన ఆరోపణలు, విమర్శలపై ఆయన రాజకీయంగా పోరాటం జరిపి ఉంటే బాగుండేదన్నారు పవన్. కోడెల ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నానన్నారు. ఈ ఆపత్కాల సమయంలో కోడెల కుటుంబసభ్యులకు ఆ దేవుడు ఆత్మస్థైర్యం ఇవ్వాలని కోరుతున్నానన్నారు. తన తరపున, పార్టీ తరపున కోడెల మృతికి తీవ్ర సంతాపం తెలిపారు పవన్ కల్యాణ్. రాజకీయవేత్తగా అంచెలంచలుగా ఎదిగి శాసనసభ్యునిగా, మంత్రిగా, ఆంధ్రప్రదేశ్ స్పీకర్‌గా కోడెల శివప్రసాదరావు ఎన్నో పదవుల్ని అలంకరించారన్నారు.

First published: September 16, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...