LIVE NOW

AP Assembly Election Results 2019 Live Updates: ఆఖరి శ్వాస వరకు ప్రజల్లోనే : పవన్ కళ్యాణ్

AP Assembly election result 2019 live Updates: ఈనెల 30న ఏపీ ముఖ్యమంత్రిగా జగన్ మోహన్ రెడ్డి పదవీ స్వీకారం చేయనున్నారు. దీనికి సంబంధించి ముహుర్తం కూడా ఫిక్స్ చేశారు.

Telugu.news18.com | May 23, 2019, 9:52 PM IST
facebook Twitter google Linkedin
Last Updated May 23, 2019
auto-refresh

Highlights

ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ ఘన విజయం సాధించింది. దీంతో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తన పదవికి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను ఫ్యాక్స్ ద్వారా గవర్నర్ కార్యాలయానికి పంపారు. గవర్నర్ నరసింహన్ ఆ రాజీనామాను ఆమోదించారు. తదుపరి ప్రభుత్వం వచ్చే వరకు సీఎంగా కొనసాగాలని కోరారు. అందుకు చంద్రబాబు నాయుడు కూడా అంగీకారం తెలిపారు. ఈనెల 30న వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఏపీ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఈనెల 30న విజయవాడలో ఉదయం 10.45 గంటలకు జగన్ మోహన్ రెడ్డి ప్రమాణస్వీకారం చేస్తారు.

ఏపీలో జగన్ ప్రభంజనం సృష్టిస్తున్నారు. పార్టీ గెలుపుపై కూడా జగన్ స్పందించారు. ‘ఈ విజయం ఊహించినదే. ప్రత్యేక హోదానే మా అజెండా. అఖండ విజయం సాధించిన మోదీకి శుభాంక్షలు. ప్రజలు, దేవుడు వైసీని ఆశీర్వదించారు. రాహుల్ గురించి ఇప్పుడేం మాట్లడను.’ అంటూ జగన్ మోహన్ రెడ్డి ట్వీట్ చేశారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గాజువాక, భీమవరం రెండు చోట్లా  ఓటమిపాలయ్యారు.

ఏపీ ఎన్నికల్లో విజయం సాధించిన జగన్ మోహన్ రెడ్డికి ప్రధాని మోదీ శుభాకాంక్షలు తెలిపారు. ‘ప్రియమైన జగన్ మోహన్ రెడ్డికి, ఆంధ్ర ప్రదేశ్ లో ఘన విజయాన్ని సాధించినందుకు అభినందనలు. మీ పదవీ కాలం విజయవంతం కావాలని ఆకాంక్షిస్తున్నాను. మీకు ఇవే శుభాకాంక్షలు.’ అని మోదీ తెలుగులో ట్వీట్ చేశారు.

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాభవం తర్వాత జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ మీడియా ముందుకు వచ్చారు. విజయవాడలో పవన్ కళ్యాణ్ మీడియాతో మాట్లాడారు. తాను రెండుచోట్ల ఓడిపోయినా, జనసేన పార్టీ ఒక్క సీటు కూడా సాధించలేకపోయినా తాను మాత్రం ప్రజల్లోనే ఉంటానని స్పష్టం చేశారు.
Load More