Home /News /politics /

JANASENA CHIEF PAWAN KALYAN REACTED ON MUNICIPAL ELECTIONS RESULTS IN ANDHRA PRADESH FULL DETAILS HERE PRN

AP Municipal Elections: మున్సిపల్ ఫలితాలపై పవన్ రియాక్షన్ ఇదే... వైసీపీ గెలుపుపై ఏమన్నారంటే...!

మున్సిపల్ ఎన్నికల ఫలితాలపై స్పందించిన పవన్ కల్యాణ్

మున్సిపల్ ఎన్నికల ఫలితాలపై స్పందించిన పవన్ కల్యాణ్

పవన్ కల్యాణ్ (Pawan Kalyan) తో పాటు పార్టీ ముఖ్యనేతలు ప్రచారం చేయకపోవడం, కేవలం జనసైనికులు (Janasena Party) మాత్రమే గెలుపు బాధ్యతను భుజాన వేసుకోవడమే పార్టీ ఓటమికి కారణంగా పలువురు చెప్తున్నారు.

    ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభంజనం సృష్టించిన సంగతి తెలిసిందే. దాదాపు వందశాతం విజయాలను ఆ పార్టీ నమోదు చేసింది. ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీ స్థాయితగ్గ పోటీకూడా ఇవ్వలేకపోయింది. ఇక జనసేన, బీజేపీ పార్టీలు ఏ మాత్రం ప్రభావం చూపలేకపోయాయి. తూర్పుగోదావరి జిల్లా అమలాపురంలో తప్ప జనసేన పెద్దగా ప్రభావం చూపలేదు. ఈ నేపథ్యంలో మున్సిపల్ ఎన్నికల ఫలితాలపై జనసేన అదినేత పవన్ కల్యాణ్ స్పందించారు. బెదిరింపులతోనే వైసీపీ ఎక్కువ స్థానాల్లో విజయం సాధించిందని ఆయన అన్నారు. ఓటు వెయ్యకపోతే సంక్షేమ పథకాలు నిలిపేస్తామని బెదిరించారని.. ప్రజలకు భరోసానిచ్చి వైసీపీ ఓఠ్లు సాధించలేదని.. కడుపుమీద కొట్టి తిండి లాక్కుంటామని బెదిరించి ఓట్లు సాధించిందని ఆరోపించారు. వైసీపీ బెదిరింపులకు బలంగా బదులిస్తామని పవన్ స్పష్టం చేశారు.

    ఇక మున్సిపల్ ఎన్నికల్లో జనసేన ప్రదర్శన వివరాల్లోకి వెళ్తే.. తూర్పుగోదావరి జిల్లా అమలాపురంలో ఐదు వార్డులను కైవసం చేసుకొని రెండోస్థానంలో నిలిచింది. ఓ దశలో వైసీపీకి గట్టిపోటినిచ్చిన జనసేన ఆతర్వాత వెనుకబడింది. గ్రేటర్ విశాఖమున్సిపల్ కార్పొరేషన్లోనూ నాలుగు స్థానాల్లో గెలిచి ఉనికిని చాటుకుంది. ఒంగోలు కార్పొరేషన్లో ఒకటి గుంటూరు కార్పొరేషన్లో ఒక డివిజన్ ను జనసేన సొంతం చేసుకుంది.

    Latest Municipal Election Result Update news


    ఇక కడప జిల్లా మైదుకూరులో జనసేన ఒక్కవార్డులో విజయం సాధించి సంచలనం సృష్టించింది. ఇప్పుడు జనసేన అభ్యర్థే ఇక్కడ కీలకంగా మారారు. మొత్తం 24 వార్డులున్న మైదుకూరులో 12 చోట్ల టీడీపీ, 11 చోట్ల వైసీపీ గెలిచాయి. ఒక వార్డులో జనసేన గెలవడంతో ఛైర్మన్ అభ్యర్థిని ఆ పార్టీనే నిర్ణయించే అవకాశముంది. మరోవైపు ప్రకాశం జిల్లా జంగారెడ్డిగూడెంలోనూ జనసేన ఒక వార్డును కైవసం చేసుకుంది.

    ఇది చదవండి: ఎస్ఈసీ దూకుడు వైసీపీకి కలిసొచ్చిందా...? ఫ్యాన్ ప్రభంజనానికి అదే కారణమా..?



    మొత్తమ్మీద చూస్తే రాష్ట్ర వ్యాప్తంగా 15 వార్డుల లోపే జనసేన విజయం సాధించినట్లు తెలుస్తోంది. తిరుపతి కార్పొరేషన్లో జనసేన అభ్యర్థులు డిపాజిట్లు కోల్పోయారు. తూర్పు, పశ్చిమగోదావరి జిల్లాల్లో మెరుగైన ఫలితాలను ఆశించినా.. ప్రయోజనం లేకపోయిందని ఆ పార్టీ నేతలంటున్నారు. నరసాపురం, జంగారెడ్డి గూడెంలో టీడీపీతో కలిసి పోటీ చేసినా విజయాన్నందుకోలేదు. మొత్తానికి భారీగా సీట్లు ఆశించిన జనసేన.. అక్కడక్కడా టీడీపీతో లోపాయికారీ ఒప్పందాలు చేసుకున్నా విజయం సాధించలేకపోయింది. ఎన్నో ఆశలు పెట్టుకున్న విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్లోనూ గ్లాసు గుర్తు గల్లంతైంది. పవన్ కల్యాణ్ తో పాటు పార్టీ ముఖ్యనేతలు ప్రచారం చేయకపోవడం, కేవలం జనసైనికులు మాత్రమే గెలుపు బాధ్యతను భుజాన వేసుకోవడమే పార్టీ ఓటమికి కారణంగా పలువురు చెప్తున్నారు.

    ఇది చదవండి: సీఎం సొంత జిల్లాలో వైసీపీకి షాక్... టీడీపీ గెలుపు.. కీలకం కానున్న జనసేన


    Published by:Purna Chandra
    First published:

    Tags: Andhra Pradesh, Ap local body elections, Janasena party, Pawan kalyan

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు