విశాఖలో పవన్ కల్యాణ్ భారీ ర్యాలీ... వారికి మద్దతుగా

నవంబర్ 3వ తేదీన మధ్యాహ్నం 3 గంటలకు ర్యాలీని పవన్ కల్యాణ్ గారు స్వయంగా ముందుండి నడిపించనున్నారు. ర్యాలీ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు నిర్వహించాలన్న విషయం స్థానిక నాయకులతో చర్చించి ఖరారు చేయనున్నారు.

news18-telugu
Updated: October 20, 2019, 2:23 PM IST
విశాఖలో పవన్ కల్యాణ్ భారీ ర్యాలీ... వారికి మద్దతుగా
జనసేన అధినేత పవన్ కల్యాణ్
  • Share this:
హైదరాబాద్ జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశమైంది. పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి అధ్యక్షతన జరిగిన సమావేశంలో జనసేన పొలిటికల్ అఫైర్స్ కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్, సభ్యులు తోట చంద్రశేఖర్,రాపాక వరప్రసాద్ , కందుల దుర్గేష్ , కోన తాతారావు, ముత్తా శశిధర్, పాలవలస యశస్విని పాల్గొన్నారు. ప్రధానంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో పార్టీ కార్యాచరణ, ప్రజా సమస్యలపై చర్చించారు. ఈ సందర్భంగా నిర్మాణ రంగంపై ఆధారపడ్డ వారికి.. ముఖ్యంగా భవన నిర్మాణ కార్మికులు ఉపాధి లభించక తీవ్ర ఇబ్బందులకు లోనవుతున్న అంశంపై పీఏసీలో చర్చ జరిగింది. దీంతో కార్మికులకు మద్దతుగా జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ గారు విశాఖపట్నంలో భారీ ర్యాలీ చేయాలని నిర్ణయం తీసుకున్నారు.

నవంబర్ 3వ తేదీన మధ్యాహ్నం 3 గంటలకు ర్యాలీని పవన్ కల్యాణ్ గారు స్వయంగా ముందుండి నడిపించనున్నారు. ర్యాలీ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు నిర్వహించాలన్న విషయం స్థానిక నాయకులతో చర్చించి ఖరారు చేయనున్నారు. దీంతోపటు పార్టీ శ్రేణులలో స్థైర్యాన్ని పెంపొందించి యువ నాయకత్వం బలోపేతానికి ఉద్దేశించిన పార్టీ కార్యాచరణ, కార్తీక మాసంలో పర్యావరణం - పరిరక్షణ కోసం ఉద్దేశించిన కార్యక్రమాల నిర్వహణపై సమావేశంలో రాజకీయ వ్యవహారాల కమిటీ చర్చిస్తోంది. ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ పని తీరు, హామీలు, పథకాల అమలులో వైఫల్యాలు, విద్యుత్ సంక్షోభం, సాగుదారుల సమస్యలు, జనసేన నేతలు, శ్రేణులపై అధికార పక్షం చేస్తున్న దాడులు, నమోదు చేస్తున్న తప్పుడు కేసులపై కూడా చర్చ కొనసాగనుంది.


First published: October 20, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading