Home /News /politics /

JANASENA CHIEF PAWAN KALYAN PROTEST ON SAVE NALLAMALA FOREST SB

ప్రేమను పెంచే పనిలో... జనసేన చీఫ్ పవన్ కల్యాణ్

పవన్ కల్యాణ్

పవన్ కల్యాణ్

ప్రజల్లో ప్రకృతిపై ప్రేమను పెంచే పనిలో పడ్డారు పవన్ కల్యాణ్. తాజాగా అడవులు, ప్రకృతికి సంబంధించి మరికొన్ని ట్వీట్లు చేశారు జనసేనాని.

    నల్లమలలో యురేనీయం తవ్వకాలను వ్యతిరేకిస్తూ.. జనసేన అధినేత పవన్ కల్యాణ్ అలుపెరగని పోరాటం చేస్తున్నారు. దీనిపై అఖిపక్షనేతలతో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. నల్లమల అడవులపై అందరికీ అవగాహన పెంచుతున్నారు. తన సమావేశాలు, చర్చలు, సందేశాలతో ప్రజల్లో ప్రకృతిపై ప్రేమను పెంచే పనిలో పడ్డారు పవన్ కల్యాణ్. తాజాగా అడవులు, ప్రకృతికి సంబంధించి మరికొన్ని ట్వీట్లు చేశారు జనసేనాని.

    తన ట్విట్టర్ ఎకౌంట్లో ‘వనవాసి’ అనే అనువాద పుస్తకంపై ట్వీట్లు చేశారు పవన్ కల్యాణ్. ఈ పుస్తకం చదివితే ఎవరైరా సరే ప్రకృతి ప్రేమికులుగా మారిపోతారన్నారు. బనవాసి (తెలుగులో వనవాసి) అనే పుస్తకాన్ని 1938లో భిభూతి భూషణ్ బందోపాధ్యాయ్ రచించారని, దాన్ని సూరంపూడి సీతారాం తెలుగులోకి అనువదించారని పవన్ తెలిపారు.

    తాను టీనేజ్ లో ఉన్నప్పుడు మద్రాస్ బుక్ ఫెయిర్ లో వనవాసి పుస్తకాన్ని కొన్నానన్నారు.  అడవుల సంరక్షణ కోసం ముందుకు కదులుతారని నమ్మకం వ్యక్తం చేశారు. వనవాసి పుస్తకం ప్రకృతిపై తన ప్రేమను మరింత పెంచిందని  ట్వీట్ చేశారు పవన్.



    Published by:Sulthana Begum Shaik
    First published:

    Tags: AP Politics, Janasena, Janasena party, Nallamala, Nallamala forest, Pawan kalyan, Save Nallamala

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు