ఏపీ గవర్నర్‌ను కలిసిన జనసేన అధినేత పవన్ కల్యాణ్

ఆంధ్రప్రదేశ్ కొత్త గవర్నర్‌గా విశ్వభూషణ్ హరిచందన్ జులై 24న ఉదయం 11.30 గంటలకు రాజ్‌భవన్‌లో ప్రమాణ స్వీకారం చేశారు .

news18-telugu
Updated: July 30, 2019, 1:33 PM IST
ఏపీ గవర్నర్‌ను కలిసిన జనసేన అధినేత పవన్ కల్యాణ్
పవన్ కల్యాణ్
  • Share this:
ఏపీ గవర్నర్‌తో భేటీ అయ్యారు జనసేన అధినేత పవన్ కల్యాణ్.  అమరావతిలో ఉన్న గవర్నర్ బిశ్వబూషన్ హరిచందన్‌తో ఆయన మర్యాద పూర్వకంగా కలిశారు. పవన్ కల్యాణ్ వెంట జనసేన నాయకులు నాందెండ్ల మనోహర్, నాగబాబు కూడా ఉన్నారు. మరోవైపు ఇవాళ సీఎం జగన్ కూడా ఏపీ గవర్నర్‌తో సమావేశం కానున్నట్లు తెలుస్తోంది. ఇవాళ సాయంత్రం నాలుగు గంటలకు ఈ భేటీ జరగనుంది. దీంతో గవర్నర్ , సీఎం ల భేతీపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారుతున్న జగన్ తీసుకున్న నిర్ణయాలపై, పలు కీలక అంశాలపై జగన్ గవర్నర్ కు వివరించే అవకాశం ఉంది.

ఆంధ్రప్రదేశ్ కొత్త గవర్నర్‌గా విశ్వభూషణ్ హరిచందన్ జులై 24న ఉదయం 11.30 గంటలకు రాజ్‌భవన్‌లో ప్రమాణ స్వీకారం చేశారు . ఏపీ గవర్నర్‌గా  ఆయన బాధ్యతలు చేపట్టారు దీంతో ఒకప్పుడు సీఎం క్యాంప్ కార్యాలయం అయిన భవనాన్ని రాజ్‌భవన్‌ గా మార్చారు. నవ్యాంధ్ర ఏర్పడిన ఇంత కాలానికి ఏపీకి ప్రత్యేకంగా గవర్నర్ ను నియమించిన నేపధ్యంలో ఆయన ప్రస్తుత ప్రభుత్వంతో ఎలా ఉంటారు అన్నది ప్రధానాంశంగా మారింది.
Published by: Sulthana Begum Shaik
First published: July 30, 2019, 1:33 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading