విశాఖలో పవన్ కళ్యాణ్ లాంగ్ మార్చ్.. టీడీపీ నేతలు హాజరు

జనసేన ర్యాలీకి టీడీపీ, బీజేపీ మద్దతిచ్చాయి. టీడీపీ నుంచి సీనియర్ నేత అయ్యన్న పాత్రుడు, మాజీ మంత్రులు కింజరాపు అచ్చెన్నాయుడు, గంటా శ్రీనివాస్ జనసేన లాంగ్ మార్చ్‌కు హాజరయ్యారు.

news18-telugu
Updated: November 3, 2019, 4:45 PM IST
విశాఖలో పవన్ కళ్యాణ్ లాంగ్ మార్చ్.. టీడీపీ నేతలు హాజరు
పవన్ కళ్యాణ్ (ఫైల్ ఫొటో)
  • Share this:
ఏపీలో ఇసుక కొరతకు నిరసనగా జనసేన కదం తొక్కింది. విశాఖపట్టణంలో పవన్ కళ్యాణ్ లాంగ్ మార్చ్ ప్రారంభమైంది. మద్దిలపాలెం కూడలిలోని తెలుగు తల్లి విగ్రహం నుంచి ప్రారంభమైన లాంగ్ మార్చ్.. స్వర్ణభారతి, రామా టాకీస్‌, RTC కాంప్లెక్స్‌ మీదుగా GVMC గాంధీ విగ్రహం వరకు సాగనుంది. అనంతరం సాయంత్రం తర్వాత ఉమెన్స్‌ కాలేజీ ముందు బహిరంగ సభ ఉంటుంది. పవన్ కళ్యాణ్ లాంగ్ మార్చ్‌కు జనసైనికులు. భనవ నిర్మాణ రంగ కార్మికులు భారీగా తరలివచ్చారు. కారుపై నిలబడి ప్రజలు అభివాదనం చేస్తున్నారు పవన్.


జనసేన ర్యాలీకి టీడీపీ, బీజేపీ మద్దతిచ్చాయి. టీడీపీ నుంచి సీనియర్ నేత అయ్యన్న పాత్రుడు, మాజీ మంత్రులు కింజరాపు అచ్చెన్నాయుడు, గంటా శ్రీనివాస్ జనసేన లాంగ్ మార్చ్‌కు హాజరయ్యారు. బీజేపీని ఆహ్వానించారన్న కారణంతో ఆ ర్యాలీకి లెఫ్ట్ పార్టీలు దూరంగా ఉన్నాయి. భారీ జనం తరలివచ్చిన ఈ ర్యాలీకి పోలీసులు పటిష్ట బందోబస్తు కల్పిస్తున్నారు. డ్రోన్ కెమెరాలతో ప్రత్యేక నిఘా పెట్టారు. సాయంత్రం జరిగే బహిరంగ సభలో పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడతారన్న దానిపై అందరిలోనూ ఆసక్తి నెలకొంది.
Published by: Shiva Kumar Addula
First published: November 3, 2019, 4:43 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading