వచ్చే ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ పోటీ ఇక్కడి నుంచే...

పార్టీ నాయకులు సూచించడంతో రెండు చోట్లా (భీమవరం, గాజువాక) నుంచి పోటీ చేశా. లేకపోతే తాడేపల్లిగూడెం నుంచే పోటీ చేయాల్సి ఉందని పవన్ కళ్యాణ్ అన్నారు.

news18-telugu
Updated: February 16, 2020, 7:30 PM IST
వచ్చే ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ పోటీ ఇక్కడి నుంచే...
పవన్ కళ్యాణ్
  • Share this:
ఆంధ్రప్రదేశ్‌లో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే సీటుపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ హింట్ ఇచ్చారు. పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం నుంచి పోటీ చేయొచ్చని ప్రకటించారు. నిన్న అమరావతిలో పర్యటించిన పవన్ కళ్యాణ్ ఇవాళ తాడేపల్లిగూడెంలో జనసేన పార్టీ కార్యకర్తలతో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘గత ఎన్నికల్లో రెండు చోట్ల పోటీ చేయాలని నాకు ఆసక్తి లేదు. కానీ, పార్టీ నాయకులు సూచించడంతో రెండు చోట్లా (పశ్చిమగోదావరి జిల్లా భీమవరం, విశాఖ జిల్లా గాజువాక) నుంచి పోటీ చేశా. లేకపోతే తాడేపల్లిగూడెం నుంచే పోటీ చేయాల్సి ఉంది. తాడేపల్లిగూడెం సులువుగా గెలవాల్సిన సీటు. వచ్చే ఎన్నికల్లో ఇక్కడి (తాడేపల్లిగూడెం) నుంచే పోటీ చేసే అంశాన్ని పరిశీలిస్తా.’ అని పవన్ కళ్యాణ్ అన్నారు.

పవన్ కళ్యాణ్


ఢిల్లీ ఎన్నికల ఫలితాలు, సీఎం జగన్ మోహన్ రెడ్డి మీద పవన్ కళ్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. డబ్బులు లేకుండా రాజకీయాల్లో గెలుస్తారనడానికి చాలా ఉదాహరణలు ఉన్నాయని పవన్ కళ్యాణ్ అన్నారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలే అందుకు ఉదాహరణగా చెప్పారు. ఎలాంటి డబ్బులు పంచకుండానే ఢిల్లీలో అరవింద్ కేజ్రీవాల్ వరుసగా మూడోసారి గెలిచారన్నారు. ఢిల్లీలో డబ్బులిచ్చి గెలవలేదని, ఐడియాలజీతో గెలిచారన్నారు. తనకు జగన్ లాగా గనుల కాంట్రాక్టులు లేవని, భీమవరంలో తన మీద గెలిచిన గ్రంథి శ్రీనివాస్ లాగా ఆక్వా వ్యాపారం కూడా లేదన్నారు. స్వశక్తితో మీద బతకడానికి సినిమాలు మాత్రమే ఉన్నాయని చెప్పారు. రెండు కులాల మధ్య రాష్ట్రం విచ్ఛిన్నం అవుతోందని పవన్ కళ్యాణ్ అన్నారు. తనను కులం చూసి కాకుండా సిద్ధాంతాలు చూసి ఓటు వేయాలని సూచించారు. బాధ్యతగా రాజకీయాలు చేయాల్సిన అవసరం ఉందన్నారు.

పవన్ కళ్యాణ్
2019 ఏప్రిల్‌లో జరిగిన ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ రెండు చోట్ల నుంచి పోటీ చేసి ఓడిపోయారు. పశ్చిమగోదావరి జిల్లా భీమవరం, విశాఖ జిల్లా గాజువాకలో రెండు చోట్లా వైసీపీ అభ్యర్థి చేతిలో ఓటమిచెందారు. భీమవరంలో గ్రంథి శ్రీనివాస్ గెలిస్తే, గాజువాకలో తిప్పల నాగిరెడ్డి విజయం సాధించారు.
First published: February 16, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు