మెగాస్టార్ చిరంజీవి రాజకీయ జీవితంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు జనసన అధినేత పవన్ కల్యాణ్. చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ నెలకొల్పి ఆ తర్వాత దాన్ని కాంగ్రెస్ పార్టీలో కలిపిన విషయం తెలిసిందే. అయితే తన అన్న చిరంజీవి మెతకతనం, ఒత్తిడితోనే ప్రజారాజ్యం పార్టీని నడపలేకపోయారని వ్యాఖ్యలు చేశాను జనసేనాని పవన్ కల్యాణ్. జనసేన ఓటమి తర్వాత నేతలందరినీ తాను కూర్చోబెట్టి మాట్లాడానన్నారు. అలా తన సోదరుడు చిరంజీవి కూడా చేసి ఉంటే ఇవాల్టీకి ప్రజారాజ్యం పార్టీ ఉండేదని ఆశాభావం వ్యక్తం చేశారు. జనసేనకు ప్రస్తుతం అసెంబ్లీలో ఒకే ఒక్క ఎమ్మెల్యే ఉన్నారని.. భవిష్యత్లో ఏపీ అసెంబ్లీ మొత్తం స్థానాలను ఆక్రమించే స్థాయికి తమ పార్టీ చేరుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
ప్రతి ఓటు కీలకమైందని.. జనసైనికులంతా పార్టీ బలోపేతానికి సమష్టిగా కృషి చేయాలని పవన్ పిలుపునిచ్చారు. పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో నరసాపురం లోక్సభ నియోజకవర్గ నేతలు, కార్యకర్తలతో నిర్వహించిన ఆత్మీయ సమావేశంలో మాట్లాడుతూ ఆయన చిరంజీవిపై ఇలా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అపజయానికి కుంగిపోయి.. విజయానికి పొంగిపోయే వ్యక్తిని తాను కాదన్నారు. ఎలాంటి సమస్యనైనా చాలా బలంగా ఎదుర్కోగలనని చెప్పారు పవన్. తనపై తనకు ఆ నమ్మకం ఉందన్నారు జనసేన చీఫ్. ప్రజలు తనకు ఓట్లేయకపోయినా ప్రజా సమస్యల పరిష్కారానికి తన పోరాటం కొనసాగిస్తానని చెప్పారు.
Published by:Sulthana Begum Shaik
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.